నువ్వు చనిపోయావ్‌ కదా..!

ABN , First Publish Date - 2021-10-07T05:13:43+05:30 IST

రుద్రవరం మండల పరిధిలోని నరసాపురం గ్రామానికి చెందిన ఈ యువకుడి పేరు శ్రీరామ్‌ రెడ్డి. వయసు 28 సంవత్సరాలు. సుమారు 15 సంవత్సరాల క్రితం తల్లిదండ్రులు చనిపోయారు.

నువ్వు చనిపోయావ్‌ కదా..!

రుద్రవరం మండల పరిధిలోని నరసాపురం గ్రామానికి చెందిన ఈ యువకుడి పేరు శ్రీరామ్‌ రెడ్డి. వయసు 28 సంవత్సరాలు. సుమారు 15 సంవత్సరాల క్రితం తల్లిదండ్రులు చనిపోయారు. సొంత ఇల్లు, పొలం వంటి ఆస్తులు ఏవీ లేవు. ఒంటరి అయిన ఈ యువకుడు కూలి పనులకు వెళుతుంటాడు. రేషన కార్డు కోసం దరఖాస్తు చేస్తే.. ఆధార్‌ నెంబర్‌ను పరిశీలించిన అధికారులు.. ‘నువ్వు చనిపోయావ్‌ కదా..?’ అన్నట్లు చూశారు. కారణం.. ఆ ఆధార్‌ నెంబర్‌ ఉన్న వ్యక్తి మరణించినట్లు ఆనలైనలో నమోదు కావడమే..! ఆరు నెలల క్రితం కలెక్టర్‌ వీరపాండియనను కలిసి ఈ సమస్యను తెలిపానని, ఇప్పటికీ పరిష్కారం కాలేదని ఈ యువకుడు వాపోతున్నాడు. రేషన కార్డు సంగతి అటుంచితే, కనీసం ఈ యువకుడు బతికి ఉన్నట్లు గుర్తించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది.             

 - రుద్రవరం


Updated Date - 2021-10-07T05:13:43+05:30 IST