చార్‌ధామ్ యాత్రకు వెళుతున్నారా? ఇప్పుడు ఇంకా సులువుగా...

ABN , First Publish Date - 2021-09-30T23:00:27+05:30 IST

చార్‌ధామ్ యాత్రికుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేయడంపై

చార్‌ధామ్ యాత్రకు వెళుతున్నారా? ఇప్పుడు ఇంకా సులువుగా...

న్యూఢిల్లీ : చార్‌ధామ్ యాత్రికుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేయడంపై ఉత్తరాఖండ్ ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ దేవస్థానాలను సందర్శించే రోజువారీ భక్తుల సంఖ్యను పెంచాలని హైకోర్టును కోరాలని భావిస్తోంది. ఈ వివరాలను రాష్ట్ర ప్రభుత్వ అదనపు చీఫ్ సెక్రటరీ ఆనంద్ బర్ధన్ గురువారం తెలిపారు. కేదార్‌నాథ్, బదరీనాథ్, గంగోత్రి, యమునోత్రి దేవాలయాలను ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు సందర్శిస్తారన్న సంగతి తెలిసిందే.


ఆనంద్ బర్ధన్ మాట్లాడుతూ, ప్రస్తుత విధానం ప్రకారం చార్‌ధామ్ భక్తులు డ్యూయల్ రిజిస్ట్రేషన్ చేయించుకోవలసి ఉంటుందని తెలిపారు. స్మార్ట్ సిటీ పోర్టల్‌లోనూ, దేవస్థానం బోర్డు పోర్టల్‌లోనూ రిజిస్ట్రేషన్ చేయించుకోవలసి ఉంటుందని చెప్పారు. ఈ ప్రక్రియను సులభతరం చేయడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. దేవస్థానం బోర్డు పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేయించుకున్న భక్తులు స్మార్ట్ సిటీ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేయించుకోవలసిన అవసరం లేకుండా కొత్త విధానాన్ని తీసుకురాబోతున్నట్లు తెలిపారు. కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో రోజువారీ సందర్శించే భక్తుల సంఖ్యను పెంచాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించాలనుకుంటున్నట్లు తెలిపారు. 


Updated Date - 2021-09-30T23:00:27+05:30 IST