జీవన మంత్రం: అన్నీ ఉన్నా వృద్ధాప్యంలో ఒంటరితనంతో కుమిలిపోతున్నారా?.. దీనికి పరిష్కారం ఇదే!

ABN , First Publish Date - 2021-11-28T12:32:01+05:30 IST

ఒకానొకప్పుడు శ్రీకృష్ణుని తల్లిదండ్రులు..

జీవన మంత్రం: అన్నీ ఉన్నా వృద్ధాప్యంలో ఒంటరితనంతో కుమిలిపోతున్నారా?.. దీనికి పరిష్కారం ఇదే!

ఒకానొకప్పుడు శ్రీకృష్ణుని తల్లిదండ్రులు వసుదేవుడు, దేవకి వారి రాజభవనంలో ఒంటరిగా కూర్చున్నారు. అప్పుడు ద్వారపాలకుడు వచ్చి.. ‘‘మహరాజా.. మీరు ఆదేశించినట్లుగా, నారద మునికి ఆహ్వానం పంపాం..వారు ఇప్పుడు రాజభవనానికి వచ్చారని’’ తెలిపాడు. ఈ మాటవినగానే వసుదేవుడు ఆనందంతో ఉప్పొంగిపోయాడు. నారదుణ్ణి ఘనంగా స్వాగతించి, అన్ని సత్కారాలు పూర్తి చేశాడు. తరువాత వసుదేవుడు, దేవకి.. నారదునికి సమీపంలో కూర్చున్నారు. అప్పుడు నారదుడు.. ‘‘మహారాజా..  మీరు నన్ను ఎందుకు గుర్తు చేసుకున్నారు?’’ అని అడిగాడు. దీనికి వసుదేవుడు.. ‘‘మునివర్యా.. మా కుటుంబం అన్ని రకాల సంపదలతో తులతూగుతోంది. మా పిల్లలు కూడా ఎంతో మంచివారు. మా కుటుంబం సమాజ సేవలో కూడా పాల్గొంటోంది. జీవితంలో అన్నీవున్నా దేవకి, నేనూ చాలా ఒంటరితనంతో కుమిలిపోతున్నాం’’ అని ఆవేదన వ్యక్తం చేశాడు. 


వెంటనే నారడుదు.. ‘‘ఎందుకు అలా అనిపిస్తోంది మహారాజా?’’ అని అడిగాడు. వెంటనే వసుదేవుడు మాట్లాడుతూ.. ‘‘పిల్లలు, మనుమలు అంతా వారి బాధ్యతలను నెరవేర్చడంలో మునిగిపోయారు. మేమిద్దరం ముసలివాళ్లం అయిపోయినందున భవనంలోనే ఎక్కువ సమయం గడుపుతున్నాం. ఒంటరితనం మమ్మల్ని ఇబ్బంది పెడుతోంది.. ఇప్పుడు చెప్పండి.. దీనికి పరిష్కారం ఏమిటి? మేము ఏమి చేయాలి?’’ అని అడిగాడు. దీనికి నారదుడు సమాధానమిస్తూ.. ‘‘ఇటువంటి సమయంలో మీరు సత్సంగం చేయాలి. ఇది మీ మానసిక కుంగుబాటును తొలగిస్తుంది. ఒంటరిగా ఉన్నామన్న భావం కూడా దూరమవుతుంది’’ అని అన్నాడు. వెంటనే వసుదేవుడు మాట్లాడుతూ.. ‘‘అందుకే మేము మీతో సత్సంగం చేయాలనుకుంటున్నాం.. మీ కంటే మెరుగైన జ్ఞానం మాకు ఎక్కడ దొరుకుతుంది?’’ అని అన్నాడు. ఈ మాటవిన్నంతనే నారదుడు దేవకి వసుదేవులతో సత్సగం చేశాడు. భక్తికి, జ్ఞానానికి సంబంధించిన అనేక కథలు చెప్పాడు. వీటిని విన్న దేవకివసుదేవుల మానసిక కుంగుబాటు తొలగిపోయింది. వారు తేలికపడ్డారు. వృద్ధాప్యంలో ఎలా మెలగాలో తెలుసుకున్నారు. ప్రతి మనిషికి జీవితంలో వృద్ధాప్యం అనేది తప్పకుండా వస్తుంది. అయితే ఆ సమయంలో వారి పిల్లలు వారివారి వ్యాపకాలలో ఉంటారు. అటువంటి పరిస్థితిలో పెద్దలు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. శారీరక, మానసిక పరిస్థితులను చక్కదిద్దగల వ్యక్తులతో సత్సగం చేయాలి.

Updated Date - 2021-11-28T12:32:01+05:30 IST