‘నువ్వు మహమ్మద్‌వా?’ అని ప్రశ్నించిన మాజీ కార్పొరేటర్ భర్త.. ఆ తర్వాత శవమై కనిపించిన వృద్ధుడు

ABN , First Publish Date - 2022-05-22T00:16:44+05:30 IST

మధ్యప్రదేశ్‌లోని నీముచ్ జిల్లా మనాసాలో దారుణం జరిగింది. 65 ఏళ్ల వృద్ధుడిని ‘నువ్వు మహమ్మద్‌వా’ అని

‘నువ్వు మహమ్మద్‌వా?’ అని ప్రశ్నించిన మాజీ కార్పొరేటర్ భర్త.. ఆ తర్వాత శవమై కనిపించిన వృద్ధుడు

భోపాల్: మధ్యప్రదేశ్‌లోని నీముచ్ జిల్లా మనాసాలో దారుణం జరిగింది. 65 ఏళ్ల వృద్ధుడిని ‘నువ్వు మహమ్మద్‌వా’ అని ప్రశ్నించి ఆధార్‌కార్డు చూపించమని ఓ వ్యక్తి గద్దించిన తర్వాత అతడు విగతజీవిగా కనిపించడం కలకలం రేపింది. ఆ వృద్ధుడిని గుర్తుపట్టేందుకు పోలీసులు అతడి ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ ఫొటోలను అతడి కుటుంబ సభ్యులు గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. అతడి పేరు భన్వర్‌లాల్ జైన్ అని, అతడి మానసిక స్థితి సరిగా లేదని వారు చెప్పినట్టు పేర్కొన్నారు. 


భన్వర్‌లాల్ జైన్ మృతదేహాన్ని శుక్రవారం అతడి కుటుంబ సభ్యులకు పోలీసులు అప్పగించారు. కాగా, అతడికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియా వైరల్ అయి సంచలనం సృష్టిస్తోంది. ఆ వీడియోలో ఓ వ్యక్తి భన్వర్‌లాన్‌ను మరో మతానికి చెందిన వ్యక్తిగా భావించి ఈడ్చుకెళ్తున్నట్టుగా ఉంది. అంతేకాదు, అతడి ఆధార్ కార్డును అడగడం కూడా ఆ వీడియోలో వినిపిస్తోంది.


ఆ వీడియోలో రెడ్ షర్ట్ ధరించిన వ్యక్తి ఆ వృద్ధి ఆపకుండా కొడుతూనే... ‘‘నీ పేరు మహమ్మదా?.. ఆధార్ కార్డు చూపించు’’ అని నిలదీశాడు. నిందితుడిని దినేశ్ కుష్వాహాగా పోలీసులు గుర్తించారు. అతడి భార్య గతంలో నగర కార్పొరేటర్‌గా పనిచేశారని పోలీసులు తెలిపారు. కాగా, వృద్ధుడిని కొట్టి చంపిన ఘటనలో మరికొందరి పాత్ర కూడా ఉన్నట్టు అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు. నిందితుల కోసం గాలిస్తున్నట్టు చెప్పారు. 

Updated Date - 2022-05-22T00:16:44+05:30 IST