పొడి దగ్గు వేధిస్తోందా!

ABN , First Publish Date - 2021-03-06T19:31:06+05:30 IST

పోషకాలతో నిండిన వాల్‌నట్స్‌ ఆరోగ్యానికి ఎన్నో విధాలా మంచి చేస్తాయి. వీటిలో యాంటీ ఆక్సిండెంట్లు పొడి దగ్గు, కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనాన్ని ఇస్తాయి. ఇంతకు వీటిని ఎలా తింటే లాభదాయకమో చూద్దాం....

పొడి దగ్గు వేధిస్తోందా!

ఆంధ్రజ్యోతి(06-03-2021)

పోషకాలతో నిండిన వాల్‌నట్స్‌ ఆరోగ్యానికి ఎన్నో విధాలా మంచి చేస్తాయి. వీటిలో యాంటీ ఆక్సిండెంట్లు పొడి దగ్గు, కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనాన్ని ఇస్తాయి. ఇంతకు వీటిని ఎలా తింటే లాభదాయకమో చూద్దాం....

వేగించిన వాల్‌నట్స్‌ రోజూ తింటే శరీరం దృఢంగా మారుతుంది. కండరాల బలహీనత లేదా అనారోగ్యంతో బాధపడేవారికి వాల్‌నట్స్‌ మంచి ఛాయిస్‌. 

వాల్‌నట్‌ పొడి లేదా పేస్ట్‌ను పాలలో వేసి ఫేస్‌ప్యాక్‌ తయారుచేసుకోవాలి. ఈ ప్యాక్‌ను ముఖానికి రాసుకొని పదినిమిషాల తరువాత శుభ్రం చేసుకోవాలి. వాల్‌నట్‌ ఫేస్‌ప్యాక్‌ మలినాలను తొలగించి చర్మానికి మెరుపునిస్తుంది.

వాల్‌నట్స్‌ను నూనెలో వేగించి, దానికి రుచికోసం కొద్దిగా చక్కెర పొడి కలపాలి. దీన్ని రోజులో రెండు సార్లు పొడిదగ్గు తగ్గిపోతుంది.

Updated Date - 2021-03-06T19:31:06+05:30 IST