కరోనా మందు విక్రేత అరెస్టు

ABN , First Publish Date - 2021-06-14T06:06:49+05:30 IST

కృష్ణపట్నం నుంచి తెచ్చిన ఆనందయ్య కరోనా మందు అని చెబుతూ దానిని విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ వెంకటాద్రి తెలిపారు.

కరోనా మందు విక్రేత అరెస్టు
నిందితుడు అన్నె కాంతారావును మీడియా ముందు ప్రవేశపెడుతున్న ఎస్‌.ఐ వెంకటాద్రి

తాడికొండ, జూన్‌ 13: కృష్ణపట్నం నుంచి తెచ్చిన ఆనందయ్య కరోనా మందు అని చెబుతూ దానిని విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ వెంకటాద్రి తెలిపారు. ఆదివారం తాడికొండ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో  వివరాలు వెల్లడించారు. తాడికొండ మండలం మోతడక గ్రామానికి చెందిన అన్నె కాంతారావు అనే వ్యక్తి ఆనందయ్య కరోనా మందు అని చెప్పి గ్రామస్తులకు గత పదిరోజుల నుంచి అమ్ముతున్నాడు. పోలీసులకు సమాచారం రావటంతో శనివారం రాత్రి అన్నె కాంతారావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 10 రోజులుగా 750 ప్యాకెట్లును రూ.200 చొప్పున అమ్మినట్లు తెలిపారు. 750 కరోనా మందు ప్యాకెట్లకు సంబంధించిన రూ.1,50,000 నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో స్టేషన్‌ రైటర్‌ సుబ్బారావు, కానిస్టేబుల్‌ ప్రేమ్‌కుమార్‌ తదితరలు పాల్గొన్నారు.


Updated Date - 2021-06-14T06:06:49+05:30 IST