కేబుల్‌ వైర్ల చోరీ కేసులో 8మంది అరెస్టు

ABN , First Publish Date - 2021-10-20T05:44:34+05:30 IST

రాజధాని అమరావతిలో కేబుల్‌ వైర్లు, నీళ్ల మోటార్లు, బ్యాటరీలు దొంగిలించిన అమ్ముతున్న వ్యక్తులను మంగళవారం తుళ్లూరు పోలీసులు అరెస్టు చేశారు.

కేబుల్‌ వైర్ల చోరీ కేసులో 8మంది అరెస్టు
స్వాధీనం చేసుకున్న సొత్తుతో సీఐ దుర్గా ప్రసాద్‌, సిబ్బంది. కింద కూర్చున్నది దొంగతనం చేసిన వ్యక్తులు

రూ.2,41,000 విలువైన సొత్తు స్వాధీనం 

తుళ్లూరు, అక్టోబరు 19: రాజధాని అమరావతిలో కేబుల్‌ వైర్లు, నీళ్ల మోటార్లు, బ్యాటరీలు దొంగిలించిన అమ్ముతున్న వ్యక్తులను మంగళవారం తుళ్లూరు పోలీసులు అరెస్టు చేశారు. స్టేషన్‌లో  మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తుళ్లూరు సీఐ దుర్గాప్రసాద్‌ వివరాలు వెల్లడించారు..

తుళ్లూరు మండలం నేలపాడుకు చెందిన గుడిమెట్ల ప్రవీణ్‌కుమార్‌, ఎనుబర్ల సాగర్‌, బొక్కా సుందరావు, కొయ్యగూర కిషోర్‌, మేకల మహీంద్ర, బొక్కా జోజిబాబు, సుంకిశాల జగన్‌, కారుమున సాంబశివరావు కలిసి కొంత కాలం నుంచి రాజధానిలో కేబుల్‌ వైర్లు, బ్యాటరీలు, నీళ్ల మోటారులు దొంగిలించారు. దొంగిలించిన సొత్తు విలువ రూ.2,41,00 వరకు ఉంటుంది. విజయవాకు చెందిన గోడ శివ, నేలపాడుకు చెందిన షేక్‌ జానీబాషా, తుళ్లూకు చెందిన పానుగంటి హనుమంతురావు దొంగతనం చేసిన సొత్తును కొనుగోలు చేశారని, వారిపైన కూడా కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. కేసును త్వరతగతిని చేధించిన ఎస్‌ఐ వై.సురేష్‌, కానిస్టేబుళ్లు అబ్దుల్‌ ఫరీద్‌, గోపి, ఐటీ కోర్‌ సిబ్బందిని, తుళ్లూరు సీఐ దుర్గాప్రసాద్‌ను రూరల్‌ ఎస్పీ విశాల్‌ గున్ని అభినందించారు.


Updated Date - 2021-10-20T05:44:34+05:30 IST