అర్జెంటీనా.. ప్రపంచ విజేత

ABN , First Publish Date - 2021-12-06T07:31:48+05:30 IST

జూనియర్‌ హాకీ ప్రపంచక్‌పను అర్జెంటీనా గెలుచుకుంది. ఆదివారం ఇక్కడి కళింగ స్టేడియంలో జరిగిన ఫైనల్లో అర్జెంటీనా 4-2 గోల్స్‌ తేడాతో ఆరుసార్లు చాంపియన్‌ జర్మనీకి షాకిచ్చి టైటిల్‌ విజేతగా నిలిచింది. అర్జెంటీనా ఆటగాడు లటారో డొమెనె (10వ, 25వ, 50వ) హ్యాట్రిక్‌ గోల్స్‌ కొట్టి తన జట్టు విజయంలో కీలకపాత్ర...

అర్జెంటీనా.. ప్రపంచ విజేత

  • ఫైనల్లో జర్మనీకి షాక్‌
  • జూనియర్‌ హాకీ వరల్డ్‌కప్‌

భువనేశ్వర్‌: జూనియర్‌ హాకీ ప్రపంచక్‌పను అర్జెంటీనా గెలుచుకుంది. ఆదివారం ఇక్కడి కళింగ స్టేడియంలో జరిగిన ఫైనల్లో అర్జెంటీనా 4-2 గోల్స్‌ తేడాతో ఆరుసార్లు చాంపియన్‌ జర్మనీకి షాకిచ్చి టైటిల్‌ విజేతగా నిలిచింది. అర్జెంటీనా ఆటగాడు లటారో డొమెనె (10వ, 25వ, 50వ) హ్యాట్రిక్‌ గోల్స్‌ కొట్టి తన జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. మరో గోల్‌ను ఫ్రాన్కో అగోస్టిని (60వ) సాధించాడు. జర్మనీ తరఫున జులియస్‌ హేనర్‌ (36వ), మాస్‌ పంట్‌ (47వ) చెరో గోల్‌ చేశారు. అర్జెంటీనాకిది రెండో ప్రపంచ టైటిల్‌. గతంలో 2005లో తొలిసారి చాంపియన్‌గా నిలిచింది.  


భారత్‌కు కాంస్యమూ చేజారె..

జూనియర్‌ హాకీ ప్రపంచకప్‌లో టైటిల్‌ నిలబెట్టుకోవడంలో విఫలమైన డిఫెండింగ్‌ చాంపియన్‌ యువ భారత్‌ కనీసం కాంస్య పతకం కూడా దక్కించుకోలేకపోయింది. మూడోస్థానం కోసం జరిగిన పోరులోనూ పరాజయం పాలైంది. ఆదివారం జరిగిన ప్లేఆఫ్‌ మ్యాచ్‌లో ఫ్రాన్స్‌ 3-1తో భారత్‌ను చిత్తుచేసి కంచు పతకం అందుకుంది. ఫ్రాన్స్‌ కెప్టెన్‌ తిమోతి క్లెమెంట్‌ హ్యాట్రిక్‌ గోల్స్‌ (26వ, 34వ, 47వ)తో విజృంభించి తన జట్టు విజయంలో ముఖ్య భూమిక పోషించాడు. భారత జట్టులో ఏకైక గోల్‌ను సుదీప్‌ చిర్మాకో (42వ) సాధించాడు.  

Updated Date - 2021-12-06T07:31:48+05:30 IST