Advertisement
Advertisement
Abn logo
Advertisement

పరిషత్‌ ఎన్నికలపై హైకోర్టులో ముగిసిన వాదనలు

అమరావతి: పరిషత్‌ ఎన్నికలపై ఏపీ హైకోర్టులో వాదనలు ముగిశాయి. వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. ఎస్‌ఈసీ తరపున సీవీ మోహన్‌రెడ్డి వాదనలు వినిపించారు. జనసేన పిటిషన్‌పై కూడా హైకోర్టు వాదనలు విన్నది. కౌంటర్‌ దాఖలు చేయాలని ఎస్‌ఈసీకి కోర్టు ఆదేశించింది. ఎస్‌ఈసీ ఒకసారి ఉత్తర్వులు ఇచ్చాక అందులో జోక్యం చేసుకునే అధికారం కోర్టులకు లేదని సీవీ మోహన్‌రెడ్డి వాదించారు. కొత్తగా ఓటు హక్కు వచ్చిన వారు పోటీ చేసే అవకాశం కోల్పోయారని, పిటిషనర్లు ఆధారాలు చూపలేదని ఎస్‌ఈసీ తరపు న్యాయవాది వాదించారు. ఎన్నికల పిటిషన్లను కొట్టివేయాలని న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి కోరారు.

Advertisement
Advertisement