అసెంబ్లీ సాక్షిగా క్షమాపణ చెప్పాల్సిందే: ఆరిమిల్లి రాధాకృష్ణ

ABN , First Publish Date - 2021-11-21T01:43:37+05:30 IST

శాసనసభలో ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు సతీమణి భువనేశ్వరిపై వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు అవమానకరంగా మాట్లాడటం సరికాదని...

అసెంబ్లీ సాక్షిగా క్షమాపణ చెప్పాల్సిందే: ఆరిమిల్లి రాధాకృష్ణ

ఏలూరు: శాసనసభలో ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు సతీమణి భువనేశ్వరిపై  వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు అవమానకరంగా మాట్లాడటం సరికాదని తణుకు నియోజవర్గం మాజీ శాసనసభ్యుడు ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. తణుకు పట్టణంలో నల్లబ్యాడ్జిలు ధరించి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబుని రాజకీయంగా ఎదురుకోలేక వ్యక్తిగతంగా, మానసికంగా విమర్శలు చేయడం సరికాదన్నారు. ఒక పక్క రాయలసీమ, తిరుపతి ప్రాంతంలలో వరదలు వచ్చి అక్కడ అతలాకుతలం అవుతుంటే సమస్యలను పరిష్కరించలేక విషయాన్ని ప్రక్కదోవ పట్టించే విధంగా మాట్లాడటం చేతకానితనమని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా తణుకు పట్టణంలో నిరసనా కార్యక్రమం చేపట్టారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. రెండున్నర సంవత్సరకాలంలో జగన్మోహన్ రెడ్డి అన్ని రంగాల్లో కూడా విఫలమైయారన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి లేదు ఎక్కడ చూసినా రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయని ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు అంటూ మరోపక్క ధరలు పెంచటం అభివృద్ధా అని ప్రశ్నించారు.  ఎన్ని విమర్శలు చేసినా రాబోవు కాలంలో చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారని జోస్యం చెప్పారు. నిన్న అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు ఏదైతే శపథం చేశారు 2024 లో మళ్ళీ ముఖ్యమంత్రి అయి అసెంబ్లీలో అడుగుపెట్టే విధంగా ప్రతి కార్యకర్త కృషి చేస్తామన్నారు. అదే విధంగా నిన్న వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు చేసిన అనుచిత వ్యాఖ్యలకు అసెంబ్లీ సాక్షిగా భువనేశ్వరికి క్షమాపణ చెప్పాలని తెలుగుదేశం పార్టీ తరుపున ఆరిమిల్లి రాధాకృష్ణ డిమాండ్ చేశారు.

Updated Date - 2021-11-21T01:43:37+05:30 IST