రీసెంట్‌గానే ‘క్రాక్ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసిన మాస్ మహారాజా రవితేజ ఇప్పుడు ‘ఖిలాడి’ సినిమా షూటింగ్లో బిజీగా ఉంటున్నాడు. రమేశ్ వర్మ పెన్మత్స దర్శకత్వంలో ఈ చిత్రాన్ని జయంతి లాల్ గడ సమర్పణలో ఏ స్టూడియోస్, పెన్ స్టూడియోస్ బ్యానర్స్‌పై కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్నారు. రమేశ్ వర్మ పెన్మత్స దర్శకత్వం వహిస్తున్నారు. మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. తాజా సమాచారం మేరకు సీనియర్ స్టార్.. యాక్షన్ కింగ్ అర్జున్ ఈ చిత్రంలో మెయిన్ విలన్‌గా నటిస్తున్నారట. ఆయన కూడా సెట్స్‌లో జాయిన్ అయిపోయారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇది వరకు నితిన్ హీరోగా చేసిన ‘లై’, విశాల్ హీరోగా చేసిన ‘అభిమన్యుడు’ చిత్రాల్లో అర్జున్ విలన్‌గా కూడా మెప్పించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి విలన్‌గా సందడి చేయడానికి సిద్ధమయ్యారన్నమాట.