స్వాతంత్య్ర వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు

ABN , First Publish Date - 2022-08-15T05:18:07+05:30 IST

జిల్లా కేంద్రం పంద్రాగస్టు వేడుకలకు సిద్ధమవుతోం ది.

స్వాతంత్య్ర వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు
ఏర్పాట్లను పరిశీలిస్తున్న అదనపు కలెక్టర్లు బీఎస్‌ లత, అరుణశ్రీ

-  జాతీయ జెండా ఆవిష్కరించనున్న మంత్రి కొప్పుల 

జగిత్యాల, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రం పంద్రాగస్టు వేడుకలకు సిద్ధమవుతోం ది. ఇందుకోసం పట్టణంలోని ఖిల్లా గడ్డ మైదానాన్ని సర్వాంగసుందరంగా తీర్చిదిద్దుతు న్నారు. సోమవారం స్వాతంత్య్ర వజ్రోత్సవాలను నిర్వహించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పట్టణంలో గల పురాతనమైన ఖిల్లా మైదానంలో స్వాతంత్య్ర వేడుకలను నిర్వహించనున్నారు. ఉదయం 10.30 గంటలకు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ చేతుల మీదుగా జాతీయ పతాకావిష్కరణ జరగనుంది. అనంతరం పోలీస్‌ పరేడ్‌, వందన స్వీకారం, మంత్రి కొప్పుల ఈశ్వర్‌ సందేశం, స్వాతంత్య్ర సమరయోధులకు సత్కారం నిర్వ హించనున్నారు. తదుపరి పాఠశాల, కళాశాలల విద్యార్థులు, యువజన, మహిళా సంఘాల సభ్యుల సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శన, వివిధ రంగాల్లో కృషిచేసిన వ్యక్తులకు ప్రశంసా పత్రాల పంపిణీ, స్టాల్స్‌ పరిశీలన, లబ్ధిదారుల కు ఆస్తుల పంపిణీ, వందన సమర్పణ తదితర కార్యక్రమాలను నిర్వహించనున్నా రు. ఇప్పటికే అదనపు కలెక్టర్లు బీఎస్‌ లత, అరుణశ్రీ, ఆర్డీవో మాధురి ఖిల్లా గడ్డను సందర్శించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఉద్యోగు లు, సిబ్బందికి పలు సలహాలు, సూచనలు ఇచ్చారు. షామీయానాల ఏర్పాటు, మంచి నీటి వసతి తదితర ఏర్పాట్లు పూర్తిచేశారు. స్వాతంత్య్ర వేడుకలకు మైదానా న్ని  అన్ని హంగులతో ముస్తాబు చేశారు.


Updated Date - 2022-08-15T05:18:07+05:30 IST