ధాన్యం కొనుగోళ్లకు పకడ్బందీ ఏర్పాట్లు

ABN , First Publish Date - 2021-10-26T06:02:05+05:30 IST

జిల్లాలో ధాన్యం కొనుగోళ్లకు పకడ్బంధీగా ఏర్పాట్లు చేస్తున్నా మని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి అన్నారు. సోమవారం సమీకృత కలెక్టరేట్‌లో అధికారులతో ధాన్యం కొను గోళ్లపై సమీక్షించారు.

ధాన్యం కొనుగోళ్లకు పకడ్బందీ ఏర్పాట్లు
మాట్లాడుతున్న కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి

- జిల్లాలో 3.50 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం 

- కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి

సిరిసిల్ల, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ధాన్యం కొనుగోళ్లకు పకడ్బంధీగా ఏర్పాట్లు చేస్తున్నా మని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి అన్నారు. సోమవారం సమీకృత కలెక్టరేట్‌లో అధికారులతో ధాన్యం కొను గోళ్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ ధాన్యం కొనుగోళ్ల కోసం 263 కేంద్రాలకు ఏర్పాట్లు చే శామన్నారు. జిల్లాలో 2021-22 సంవత్సరం వానాకాలం సాగుకు సంబంధించి 4 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి అంచనా ఉండగా 3.50 లక్ష ల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా ఉం దన్నారు. జిల్లాలో 31 బాయిల్డ్‌, 43 రైస్‌మిల్లులు 2 లక్షల 30వేల 750 మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం కలిగి ఉన్నాయని, కొనుగోలు కేంద్రాల వారీగా మిల్లులకు అనుసంధానం చేశామని తెలిపారు. కొనుగోలు కేం ద్రాలకు కావాల్సిన గన్నీ బ్యాగులు, టార్పాలిన్లు, తేమ పరీక్ష, తూకం యంత్రాలు, క్లీనర్లు పంపిణీ చేసినట్లు చెప్పారు. ప్రతీ కొనుగోలు కేంద్రంలో నిబంధనలు పాటించాలని, ఽరైతు ధ్రువీకరణ పత్రం, నాణ్యత ప్రమా ణాల  ధ్రువీకరణ పత్రం, గన్నీ, ట్రక్‌ చిట్‌ పుస్తకం వంటివి పక్కాగా ఉండాలన్నారు. ప్రతీ రైతు పేరు, మొబైల్‌ నంబరు, బ్యాంక్‌ వివరాలు ఆన్‌లైన్‌లో నమో దు చేయాలన్నారు. వ్యవసాయ విస్తరణ అధికారులు ఎఫ్‌ఏక్యూ నిబంధనల ప్రకారం ధాన్యం ఉన్నది? లేనిది? పరిశీలించాలన్నారు. రైతులు ధాన్యం అమ్ముకో వడానికి వీలుగా టోకేన్లు జారీ చేయాలన్నారు. మంగళ వారం నుంచి కేంద్రాలు ప్రారంభించడానికి చర్యలు చేపట్టాలన్నారు. రైతులకు  ఇబ్బందులు కలిగించవద్ద న్నారు. సమావేశంలో జిల్లా డీఆర్వో శ్రీనివాసరావు, జడ్పీ సీఈవో గౌతంరెడ్డి, డీఏవో రణధీర్‌రెడ్డి, డీసీఎస్‌వో జితేందర్‌రెడ్డి, డీఎంసీఎస్‌ హరికృష్ణ, డీఆర్‌డీవో కౌటిల్యరెడ్డి, డీసీవో బుద్ధనాయుడు, ఆర్టీవో కొండల్‌ రావు, ఉద్యాన శాఖ అధికారి జ్యోతి పాల్గొన్నారు. 

ప్రత్యామ్నాయ పంటలపై   అవగాహన కల్పించాలి 

వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలపై రైతులు దృష్టి సారించేలా అవగాహన కల్పించాలని  కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి అన్నారు. సోమవారం  కలెక్టరేట్‌లో వ్యవసాయ అధికారులతో ప్రత్యామ్నాయ పంటలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే యాసంగి 2021 సీజన్‌లో ఎఫ్‌సీఐ ధాన్యం సేకరించబోదని, అందుకు అనుగుణంగా రైతు లు యాసంగికి వరి పంటకు ప్రత్యామ్నాయంగా శనగ, పల్లి, మినుములు, పెసర్లు, నువ్వులు, ఆముదాలు, ధనియాలు, ఆవాలు, బబ్బెర్లు, పొద్దు తిరుగుడు వంటి పంటలను సాగు చేసే విధంగా చూడాలన్నారు. క్లస్టర్ల వారీగా రైతు వేదికల్లో ఈ నెల 27 నుంచి 29 వరకు వ్యవసాయ అధికారులు శాస్త్రవేత్తలతోపాటు రైతులతో సమావేశాలు నిర్వహించాలన్నారు. క్లస్టర్ల వారీగా యాసంగి పంట ప్రణాళిక తయారు చేయాలన్నారు. గ్రామాల్లో చిన్న చిన్న రైతు సమూహాలతో సమా వేశాలు నిర్వహించాలని, మినుముల పంట  కొను గోలుకు నాఫెడ్‌ సిద్ధంగా ఉందని అన్నారు. వరి పం డించి అమ్మకానికి రైతులు ఇబ్బందులు పడవద్దని అన్నారు. 

Updated Date - 2021-10-26T06:02:05+05:30 IST