కరోనాను ఎదుర్కొనేందుకు పకడ్బందీ చర్యలు

ABN , First Publish Date - 2022-01-20T06:43:25+05:30 IST

కరోనాను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపడుతోందని విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరె డ్డి అన్నారు. జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రితోపాటు అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సౌకర్యాలు సిద్ధంగా ఉంచాలని మంత్రి వైద్యశాఖ అధికారులను ఆదేశించారు.

కరోనాను ఎదుర్కొనేందుకు పకడ్బందీ చర్యలు
నల్లగొండలో సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి జగదీష్‌రెడ్డి, పక్కన కలెక్టర్‌ పీజే పాటిల్‌, ఎస్పీ, ఎమ్మెల్యేలు

అన్ని పీహెచ్‌సీల్లో చికిత్సలు

మొదటి దశ వ్యాక్సినేషన్‌ 99.83 శాతం పూర్తి 

విద్యుత్‌శాఖ మంత్రి జగదీ్‌షరెడ్డి 


నల్లగొండ, జనవరి 19 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): కరోనాను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపడుతోందని విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరె డ్డి అన్నారు. జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రితోపాటు అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సౌకర్యాలు సిద్ధంగా ఉంచాలని మంత్రి వైద్యశాఖ అధికారులను ఆదేశించారు. కొవిడ్‌, ఒమైక్రాన్‌, వ్యాక్సినేషన్‌పై బుధవారం నల్లగొండ జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. కరోనాను అరికట్టేందుకు మొదటి డోస్‌ వ్యాక్సినేషన్‌లో 99.83 శాతంతో, రెండో డోస్‌ వ్యాక్సినేషన్‌లో 70.53 శాతంతో జిల్లా ముందు వరుసలో నిలిచిందని తెలిపారు. 15 నుంచి 17 ఏళ్ల వయస్సు గల యువతకు ఇప్పటికే 61.42 శాతం వ్యాక్సినేషన్‌ పూర్తి చేశామని తెలిపారు. ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు, 60 ఏళ్లు పైబడిన వ్యాధిగ్రస్థులకు ముందు జాగ్రత్తగా 5,995 మందికి బూస్టర్‌ డోస్‌ వేసినట్లు మంత్రి తెలిపారు. ఒమైక్రాన్‌ వ్యాప్తి చెందకముందే ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, భౌతికదూరం పాటించాలన్నారు. కరోనా, ఒమైక్రాన్‌, డెల్టా వేరియంట్ల బారీ నుంచి ప్రజలను కాపాడేందుకు ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రస్తుతం జిల్లాలో 614 కరోనా యాక్టివ్‌ కేసులు నమోదై, 3.08శాతం ఉన్నాయన్నారు. ఎనిమిది మంది మాత్రమే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. ఒమైక్రాన్‌ను ఎదుర్కొనేందుకు జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రుల్లో పడకలు, ఆక్సిజన్‌, వెంటిలేటర్లు సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. జిల్లాలో ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రితోపాటు ఏరియా ఆస్పత్రులు, పీహెచ్‌సీల్లో కొవిడ్‌ లక్షణాలు ఉన్న ప్రతీ ఒక్కరికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో కరోనా పరీక్షల కిట్లకు, ఐసోలేషన్‌ కిట్లకు కొరత లేదని మంత్రి జగదీ్‌షరెడ్డి తెలిపారు. 


532 మందికి పాజిటివ్‌

ఆంధ్రజ్యోతి-న్యూస్‌నెట్‌వర్క్‌: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 532 మందికి బుధవారం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆత్మకూరు(ఎం)లో 51 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, ఏడుగురికి పాజిటివ్‌ వచ్చింది. వలిగొండ మండలంలో 86 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, 28 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. రామన్నపేట మండలంలో 18 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. సంస్థాన్‌నారాయణపురం మండలంలో 20, దేవరకొండలో 33 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, దేవరకొండ పోలీ్‌సస్టేసన్‌లో పనిచేస్తున్న ఓ కానిస్టేబుల్‌, ఇద్దరు హోంగార్డులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. కట్టంగూర్‌, డిండి మండలాల్లో నలుగురికి చొప్పున పాజిటివ్‌గా నమోదైంది. పెద్దఅడిశర్లపల్లి మండలంలో 9, మర్రిగూడ మండలంలో 15 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. మొత్తంగా ఉమ్మడి జిల్లాలో బుధవారం 532 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. 

Updated Date - 2022-01-20T06:43:25+05:30 IST