పకడ్బందీగా ఆరోగ్య సర్వే : కలెక్టర్‌

ABN , First Publish Date - 2022-01-22T06:20:14+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆరోగ్య సర్వేను పకడ్బంధీగా నిర్వహించాలని కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌ అన్నారు. శుక్రవారం పట్టణంలోని శాంతినగర్‌ కాలనీలో సర్వే కార్యక్రమాన్ని పరిశీలించారు. సర్వేలో భాగంగా జ్వరం, దగ్గు, జలుబువంటివి ఉన్నాయో? లేదో? తెలుసుకునేందుకు వైద్య, మున్సిపల్‌ సిబ్బంది సర్వే చేస్తున్నారని తెలిపారు. ప్రతీ రోజు 25కుటుంబాలను ఒక్కో బృందం సర్వే చే

పకడ్బందీగా ఆరోగ్య సర్వే : కలెక్టర్‌
పట్టణంలో కొవిడ్‌పై అవగాహన కల్పిస్తున్న కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌

ఆదిలాబాద్‌, జనవరి 21(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆరోగ్య సర్వేను పకడ్బంధీగా నిర్వహించాలని కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌ అన్నారు. శుక్రవారం పట్టణంలోని శాంతినగర్‌ కాలనీలో సర్వే కార్యక్రమాన్ని పరిశీలించారు. సర్వేలో భాగంగా జ్వరం, దగ్గు, జలుబువంటివి ఉన్నాయో? లేదో? తెలుసుకునేందుకు వైద్య, మున్సిపల్‌ సిబ్బంది సర్వే చేస్తున్నారని తెలిపారు. ప్రతీ రోజు 25కుటుంబాలను ఒక్కో బృందం సర్వే చేయాల్సి ఉంటుందని తెలిపారు. పట్టణంలో 114 టీమ్‌లు, గ్రామీణ ప్రాంతంలో ప్రతీ గ్రామానికి ఒక టీంను ఏర్పాటు చేసి సర్వే చేయిస్తున్నామన్నారు. ఏదైనా లక్షణాలు ఉన్నట్లయితే కొవిడ్‌ కిట్లను అందించి హోంఐసోలేషన్‌లో ఉండే విధంగా అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. ఐసోలేషన్‌లో ఉన్న వారు ఐదు రోజుల పాటు ప్రభుత్వం అందించే మందులను తీసుకోవాలన్నారు. పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతున్నాయని, వాటిని అరికట్టేందుకే ప్రతి ఒక్కరూ కొవిడ్‌ నిబంధనలు పాటించాలని జిల్లా యంత్రాంగానికి సహకరించాలని కోరారు. 15 -18ఏళ్ల పిల్లలు, 60ఏళ్లు పైబడిన వారు ఇప్పటి వరకు వ్యాక్సినేషన్‌ తీసుకోని వారికి ఫస్ట్‌, సెకండ్‌ డోసులను ఇవ్వడం జరుగుతుందన్నారు. ఇందులో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ రిజ్వాన్‌భాషా షేక్‌, మున్సిపల్‌ కమిషనర్‌ శైలజ, వార్డు ప్రత్యేకాధికారి వెంకటేశ్వర్లు, జహీర్‌ రంజాని, తదితరులు పాల్గొన్నారు.

ఇంటింటికీ ఫీవర్‌ సర్వే : జడ్పీ సీఈవో

తలమడుగు: కరోనా వైరస్‌ను నిర్మూలించేందుకు ప్రభుత్వం చేపడుతు న్న ఫీవర్‌ ఇంటింటి సర్వేను పకడ్బందీగా చేపట్టాలని జడ్పీ సీఈవో గణప తి కోరారు. శుక్రవారం మండలంలోని దేవాపూర్‌, కజ్జర్ల, బరంపూర్‌ తదితర గ్రామాల్లో చేపడుతున్న ఇంటింటి సర్వేను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా జడ్పీ సీఈవో మాట్లాడుతూ కరోనా మహామ్మారిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా చేపడుతున్న ఇంటింటి సర్వేను ముమ్మరంగా చేపట్టాలన్నారు. ఇందులో ఎంపీడీవో రమాకాంత్‌, ఎంపీఈవో దిలీప్‌కుమార్‌, దేవాపూర్‌ సర్పంచ్‌ ఎస్‌కే భేగం, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-22T06:20:14+05:30 IST