బస్ స్టాండ్‌ను లైబ్రెరీగా మార్చేసిన ఆర్మీ!

ABN , First Publish Date - 2021-03-08T03:10:07+05:30 IST

దక్షిణ కశ్మీర్‌లో నిరుపయోగంగా పడి ఉన్న ఓ బస్ స్టాండ్‌ను ఆర్మీ అధికారులు లైబ్రరీగా మార్చేశారు.

బస్ స్టాండ్‌ను లైబ్రెరీగా మార్చేసిన ఆర్మీ!

కశ్మీర్: దక్షిణ కశ్మీర్‌లో నిరుపయోగంగా పడి ఉన్న ఓ బస్ స్టాండ్‌ను ఆర్మీ అధికారులు లైబ్రెరీగా మార్చేశారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల కోసం ఈ చర్యను చేపట్టారు. ఈ వీధి లైబ్రెరీలో అనేక పుస్తకాలు అందుబాటులో ఉంచారు. ఇందు కోసం వారు బుక్స్ ఆఫ్ ఇండియా సంస్థ సహాయాన్ని తీసుకున్నారు. రాష్ట్రియ రైఫిల్స్ ఏర్పాటు చేసిన ఈ లైబ్రరీకి స్థానికంగా మంచి ఆదరణ లభిస్తోంది. రాణీపూర్, చిత్తీసిగ్పురా, కెజ్రివల్, దేవీపురా గ్రామాలకు చెందిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఈ లైబ్రెరీ సేవలను వినియోగించుకుంటున్నారు. పెద్ద తరగతి పిల్లలు లైబ్రెరీలో చదవడాన్ని చూసిన దిగువ తరగతుల విద్యార్థులు కూడా చదువుపై ఆసక్తి పెంచుకుంటున్నారని ఓ అధికారి తెలిపారు. ఉదయం గ్రంథాలయం తెరుచుకోగానే స్థానిక విద్యార్థులు ఇక్కడకు క్యూ కడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. కేవలం చదువే కాకుండా.. విద్యార్థులకు మనసు రిలాక్సయ్యేందుకు కూడా ఈ పుస్తకాలు ఉపయోగపడతాయని ఆయన అన్నారు. లైబ్రెరీకి ఆదరణ పెరుగుతున్న దృష్ట్యా భవిష్యత్తులో మరిన్ని ప్రారంభించేందుకు కూడా ఆర్మీ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. 

Updated Date - 2021-03-08T03:10:07+05:30 IST