Abn logo
Sep 18 2021 @ 00:05AM

ఆర్మీ జవాన్‌ ఆత్మహత్య

వైకుంఠరావు (ఫైల్‌)

నరసన్నపేట/జలుమూరు, సెప్టెంబరు 17:  నరసన్నపేటలోని జమ్ము జంక్షన్‌ వద్ద నివాసముంటున్న కర్రి వైకుంఠరావు (34) అనే ఆర్మీ జవాన్‌ శుక్రవారం ఉర్లాం గేటు వద్ద రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. జలుమూరు మండలం అచ్చుతాపురం గ్రామానికి చెందిన వైకుంఠరావు గత 17ఏళ్లుగా ఆర్మీ జవానుగా విధులు నిర్వహిస్తున్నారు. ఆరేళ్ల కిందట గట్లపాడుకు చెందిన షర్మిళ అనే యువతితో వివాహం అయ్యింది. వీరికి ఐదేళ్ల కుమారుడు దిలీప్‌, మూడేళ్ల పాప పూజిత ఉన్నారు. ప్రస్తుతం పంజాబ్‌ రాష్ట్రం పఠాన్‌కోటలో విధులు నిర్వహిస్తున్న వైకుంఠరావు బుధవారం రాత్రి సెలవుపై ఇంటికి వచ్చాడు. గురువారం ఉదయం భార్యాభర్తలు కలసి కుమారుడిని ఓ పాఠశాలలో చేర్పించారు. అయితే, ఏమైందో గానీ శుక్రవారం మధ్యాహ్నం భోజనం చేసి ద్విచక్ర వాహనంపై ఉర్లాం రైల్వేగేటు వద్దకు చేరుకున్నాడు. అక్కడ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆర్‌పీఎఫ్‌ హెచ్‌సీ కృష్ణారావు తెలిపారు.