Abn logo
Sep 27 2021 @ 02:47AM

మంచుదిబ్బల్లో మృతదేహం.. 16 ఏళ్ల క్రితం మరణించిన జవానుదన్న అనుమానం

16 ఏళ్ల క్రితం మరణించిన జవానుదన్న అనుమానం

ఉత్తరకాశీ (ఉత్తరాఖండ్‌), సెప్టెంబరు 26: ఓ సైనికుడి మృతదేహం.. అతడు మరణించిన 16 ఏళ్లకు లభ్యమైంది. హిమాలయాల్లోని మంచు దిబ్బల్లో కూరికుపోయి ఉండడంతో.. ఏళ్లు గడిచినా ఆ దేహం గుర్తుపట్టగలిగే స్థితిలోనే ఉంది. ఉత్తరాఖండ్‌ గర్‌వాల్‌ ప్రాంత హిమాలయాల్లోని సటోపత్‌ పర్వత శిఖరాన్ని అధిరోహించి తిరిగి వస్తున్న ఆర్మీ బృందానికి.. మంచు దిబ్బల్లో కూరుకుపోయి ఉన్న ఓ మృతదేహం కనిపించింది. అది ఓ సైనికుడి దేహంలా ఉండడంతో.. వెంటనే స్పందించిన జవాన్లు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. వాళ్లు శవపరీక్షల నిమిత్తం ఆ మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.


2005లో ఆర్మీకి చెందిన ఓ పర్వతారోహక బృందం ప్రమాదానికి లోనయిన ఘటనలో ఓ సైనికుడి ఆచూకీ దొరకలేదు. ఈ మృతదేహం అతడిదే అయి ఉండవచ్చని ఆర్మీ వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయాన్ని తేల్చేందుకు నాటి యాత్రా బృందంలోని సభ్యులను పిలిపిస్తున్నామని, అలాగే.. డీఎన్‌ఏ పరీక్షలు కూడా నిర్వహిస్తామని ఉత్తరకాశీ జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ దేహం.. ఆ తప్పిపోయిన జవానుదే అని తేలితే.. సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.