Abn logo
Nov 22 2021 @ 08:33AM

ఆ జవానుకు వచ్చే నెలలో రిటైర్మెంట్.. మిగిలివున్న కొద్ది రోజుల ఉద్యోగ జీవితాన్ని పూర్తి చేయాలని బయలుదేరాడు.. ఇంతలో ఊహించని విధంగా..

రాజస్థాన్‌లోని నోఖా పరిధిలోని సోమల్సర్ గ్రామానికి చెందిన జవాను మృతదేహం జమ్ము రైల్వే స్టేషన్ వద్ద కనిపించింది. ఈ జవాను డిసెంబరు 31న రిటైర్ కానున్నారు. అయితే ఇంతలోనే ఈ ఘోరం జరిగింది. దీంతో జవాను మృతిపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ సందర్భంగా సోమల్సర్ గ్రామ సర్పంచ్ రూపారామ్ సారణ్ మీడియాతో మాట్లాడుతూ గ్రామానికి చెందిన జవాను బజరంగ్ లాల్ వచ్చే నెలలో రిటైర్ కానున్నారని తెలిపారు. ఇటేవలే గ్రామానికి వచ్చి.. రిటైర్మెంట్‌కు సంబంధించిన పలు పనులు పూర్తి చేసి, తిరిగి జమ్ముకు బయలుదేరారన్నారు. 

ఇంతలోనే అతని మృతదేహం జమ్ము రైల్వే స్టేషన్ వద్ద కనిపించిందని జీఆర్పీఎఫ్ తమకు తెలియజేసిందన్నారు. ఈ విషయాన్ని తాను మృతుని కుటుంబ సభ్యులకు తెలియజేశానన్నారు. కొంతకాలం క్రితం భజరంగ్ లాల్ కాలికి గాయమయ్యిందని, దీంతో అతను వేగంగా నడవలేకపోతున్నాడన్నారు. అయినప్పటికీ విధులకు హాజరవుతూ వచ్చారని సర్పంచ్ తెలిపారు. సైన్యంలో 24 సంవత్సరాల పాటు పనిచేసిన తరువాత భజరంగ్ లాల్ రిటైర్ కానున్నారని, ఇంతలోనే ఈ ఘోరం జరిగిపోయిందన్నారు. భజరంగ్ లాల్ సోదరుడు రామ్‌లాల్ లెఘా ప్రస్తుతం లూణకరన్సర్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. రామ్ లాల్ తన సోదరునికి అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 

క్రైమ్ మరిన్ని...