అర్ణబ్‌ గోస్వామికి సుప్రీంలో ఊరట

ABN , First Publish Date - 2020-11-28T07:53:53+05:30 IST

సీనియర్‌ జర్నలిస్టు, రిపబ్లిక్‌ టీవీ అధినేత అర్ణబ్‌ గోస్వామికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆయన అన్వాయ్‌ నాయక్‌ అనే ఓ వ్యక్తిని ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు ఎఫ్‌ఐఆర్‌లో చేసిన ఆరోపణకు ప్రాథమిక సాక్ష్యాధారాలేవీ కనిపించడం లేదని జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ ఇందిరా బెనర్జీలతో కూడిన ధర్మాసనం తీర్పునిచ్చింది

అర్ణబ్‌ గోస్వామికి సుప్రీంలో ఊరట

ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు ఎఫ్‌ఐఆర్‌లో లేదన్న బెంచ్‌


న్యూఢిల్లీ, నవంబరు 27: సీనియర్‌ జర్నలిస్టు, రిపబ్లిక్‌ టీవీ అధినేత అర్ణబ్‌ గోస్వామికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది.  ఆయన అన్వాయ్‌ నాయక్‌ అనే ఓ వ్యక్తిని ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు ఎఫ్‌ఐఆర్‌లో చేసిన ఆరోపణకు ప్రాథమిక సాక్ష్యాధారాలేవీ కనిపించడం లేదని జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ ఇందిరా బెనర్జీలతో కూడిన ధర్మాసనం తీర్పునిచ్చింది. ఆయనకు తాత్కాలిక బెయిల్‌ మంజూరు చేస్తూ 16 రోజుల కిందట ఇచ్చిన ఉత్తర్వులు కొనసాగుతాయని, ఈ కేసును బాంబే హైకోర్టు పరిష్కరించేదాకా ఆయన బెయిల్‌పైనే ఉంటారని స్పష్టం చేసింది. ఈ కేసు విషయంలో హైకోర్టును కూడా బెంచ్‌ తీవ్రంగా తప్పుబట్టింది. రాజ్యాంగ పరిరక్షణ బాధ్యత కోర్టుదేనని, ఆ పాత్ర తనదేనన్న అంశాన్ని, పరిధిని, విధులను బాంబే హైకోర్టు విస్మరించిందని జస్టిస్‌ చంద్రచూడ్‌ ఆక్షేపించారు. 

Updated Date - 2020-11-28T07:53:53+05:30 IST