Abn logo
May 8 2020 @ 18:43PM

నెట్‌లో వైరల్ అవుతున్న ఓ నెట్టివేయబడ్డ కథ

ఆమె, తన చెల్లెలు.. మధ్యలో అతను. ఇది వినగానే ఇదేదో ట్రయాంగిల్ లవ్ స్టోరీ అనుకుంటున్నారా? అస్సలు కాదు. నెట్‌లో వైరల్ అవుతున్న ఓ నెట్టివేయబడ్డ కథ. మలైకా అరోరా చెల్లెలు అమృతా అరోరా. ఈమె కూడా అక్కలాగానే హాట్ బ్యూటీ. కొన్నాళ్లు సినిమాలు చేసి ఇప్పుడు ఇళ్లు చక్కబెట్టుకుంటుంది. అయితే పెళ్లి తర్వాత బిగ్ స్క్రీన్‌కు దూరమైంది అమృతా. కానీ పార్టీలు, ఈవెంట్స్‌లో రెగ్యులర్‌గా మెరిసిపోతూ ఉంటుంది. మరీ ముఖ్యంగా అక్క మలైకాతో కలిసి చెల్లి అమృతా కెమెరాల ముందుకు వచ్చిందంటే ఫ్లాష్‌ల వర్షం కురుస్తుంది. అదే జరిగింది ఆ మధ్య ఓ హైలెవెల్ బాలీవుడ్ హంగామాలో. 


బాలీవుడ్ ప్రఖ్యాత ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా 50వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఆ సంబరాల్లో అందరిలాగానే అరోరా సిస్టర్స్ కూడా పాల్గొన్నారు. వారిద్దరూ కలిసి కెమెరాల ముందు ఫోజులిస్తుంటే.. ఫొటోగ్రాఫర్ల ఉత్సాహానికి అవధులే లేవు. అయితే ఇంతలోనే బాలీవుడ్ యంగ్ హీరో సిద్ధార్థ శుక్లా అటుగా వచ్చాడు. వెంటనే మలైకా అతన్ని పక్కకు నెట్టేసింది. సరదాగానే ఆమె నెట్టివేసినా.. ఇప్పుడా పాత వీడియో నెట్‌లో హల్‌చల్ చేస్తుంది. బిగ్ బాస్ విన్నర్‌గా ప్రస్తుతం సిధ్దార్థ శుక్లా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నాడు. కానీ ఈ వీడియో సమయంలో అతను స్ట్రగులింగ్ యాక్టర్. ఇప్పడు ఈ వీడియోపై అతని అభిమానులు కస్సు బుస్సు మంటున్నారు. మరికొందరేమో.. ఆమె అతన్ని సరదాగానే నెట్టింది అంటున్నారు. ఏదీఏమైనా హాటీ ఆంటీ మలైకా, యంగ్ హీరో సిద్ధార్థ ఒకే వీడియోలో ఉండటం క్వారంటైన్ టైమ్‌లో బాలీవుడ్ అభిమానులకు మాంచి మ్యాటర్ దొరికినట్లు అయ్యింది.

Advertisement
Advertisement
Advertisement