Advertisement
Advertisement
Abn logo
Advertisement

సుబ్బారాయుడి షష్ఠి.. చూసి వద్దాం రండి!

నేటి నుంచి అత్తిలిలో షష్ఠి ఉత్సవాలు.. ఏర్పాట్లు పూర్తి

 వేడుకలకు పడమర విప్పర్రు ఆలయం సిద్ధం

అత్తిలి, డిసెంబరు 7: అత్తిలిలో శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కల్యాణోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 8 నుంచి 22 వరకు షష్ఠి మహోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. ఆలయాన్ని విద్యు ద్దీపాలతో అలంకరించారు.  పలు దుకాణాలు వెలిశాయి.  బుధవారం రాత్రి 7.29 గంటలకు  మద్దాల వెంకటేశ్వరరావు దంపతులు స్వామివారి కల్యాణోత్సవాన్ని నిర్వహించనున్నారు. 9న షష్ఠి సందర్భంగా ఉదయం వైభవంగా  ఊరే గింపు, 10న శ్రీ వల్లీ కల్యాణం బుర్రకథ, 11న డైనమిక్‌ ఆర్కెస్ట్రా, 12న తాడేపల్లిగూడెం వారిచే డాన్స్‌ ఈవెంట్‌, 13న రామాంజనేయ పౌరాణిక నాటకం, 14న డ్యాన్స్‌ హంగామా, 15న భక్త చింతామణి  నాటకం, 16న సత్య ఆర్కెస్ట్రా, 17న భీమవరం వారిచే సినీ మ్యూజికల్‌ నైట్‌, 18న బాలనాగమ్మ వెరైటీ బుర్రకథ, 19న సినీ మ్యూజికల్‌ నైట్‌,  20న డూప్స్‌ బాబోయ్‌ డూప్స్‌, 21న బాయ్స్‌ ఆర్కెష్ట్రా 22న తోలుబొమ్మలాట జరగనున్నాయి. 

స్వామివారికి వెండి మకర తోరణం

 వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామికి అత్తిలికి చెందిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి  కల్యాణ మండపం నిర్మాణ కమిటీ అధ్యక్షుడు కూనపరెడ్డి జయరాజు  దంపతులు 8 కిలోల వెండి మకర  తోరణం బహూకరించారు. మంగళవారం మకర తోరణానికి ఆలయ అర్చకులు అయిలూరి శ్రీరామం కృష్ణమూర్తి ఆధ్వర్యంలో పూజలు చేసి మూలవిరాట్‌కు అలంకరించారు. దాడి శ్రీనివాసరావు, దామిశెట్టి రామజగ్గయ్య, ఇర్రి  సత్యనారాయణ పాల్గొన్నారు. 

పెంటపాడు: షష్ఠి వేడుకలకు  పడమర విప్పర్రులో స్వయంభు వల్లీ దేవసేన సమేత సంతాన సుబ్రహ్మణ్యేశ్వరుని ఆలయం ముస్తాబైంది. ఈ సందర్భంగా మంగళవారం స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.  ఆలయ ప్రధానార్చకుడు కొడవటిగంటి వెంకట నర్సింహాచార్యులు, మాజీ సర్పంచ్‌ పసల చంటి  మాట్లాడుతూ బుధవారం సాయంత్రం స్వామి వారి కల్యాణం, గురువారం షష్ఠి మహోత్సవం, శనివారం తెప్పోత్సవంతో వేడుకలు ముగుస్తాయన్నారు.  మాజీ సర్పంచ్‌ పసల కనకసుందర రావు, సొసైటీ మాజీ అధ్యక్షుడు పసల అచ్యుతం, పసల సత్యనారాయణ,  నీటి సంఘం మాజీ అధ్యక్షుడు పసల గంగన్న తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement