చెరువుల్లోకి చేప పిల్లలు

ABN , First Publish Date - 2020-08-05T09:53:08+05:30 IST

ప్రభుత్వం రెండేళ్లుగా చె రువుల్లో చేప పిల్లల పంపిణీకి శ్రీకారం చుట్టగా, ఈ ఏడాది కూడా మరోమారు చేప పిల్లల పంపిణీకి ఏర్పాట్లు చేస్తోంది.

చెరువుల్లోకి చేప పిల్లలు

620 చెరువుల్లో పంపిణీకి ఏర్పాట్లు

రెండు, మూడు రోజుల్లో ప్రణాళికలు

జిల్లాలో 9722 మంది సభ్యులు


ఆంధ్రజ్యోతి, జగిత్యాల: ప్రభుత్వం రెండేళ్లుగా చె రువుల్లో చేప పిల్లల పంపిణీకి శ్రీకారం చుట్టగా, ఈ ఏడాది కూడా మరోమారు చేప పిల్లల పంపిణీకి ఏర్పాట్లు చేస్తోంది. జిల్లాలోని 620 చెరువుల్లో కో టి 46 లక్షల చేప పిల్లల పంపిణీ చేయాలని లక్ష్యం గా పెట్టుకోగా, ఈ మేరకు సోమవారం టెండర్‌ ప్ర క్రియను పూర్తి చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు బుధవారం నుంచి చేప పిల్లలు పంపిణీ చేయాల్సి ఉండగా, రాష్ట్ర కేబినెట్‌ సమావేశం దృష్ట్యా పంపిణీ కార్యక్రమాన్ని వాయిదా వేశారు. ఇప్పటికే టెండర్‌ ప్రక్రియ పూర్తయిన దృష్ట్యా రెండు, మూడు రోజుల్లోనే చేప పిల్లలు చెరువుల్లోకి చేరనున్నాయి.


జిల్లాలో 194 సహకార సంఘాలు

జిల్లాలో 380 గ్రామ పంచాయతీలు ఉండగా, మొత్తం 394 మత్స్య కార్మిక సహకార సంఘాలు ఉ న్నాయి. ఇందులో 168 పురుష సంఘాలు కాగా, 26 స్త్రీ సంఘాలు ఉన్నాయి. ఇందులో మొత్తం 9772 మంది సభ్యులు ఉన్నారు. జిల్లావ్యాప్తంగా 1294 చె రువులు ఉండగా, నీటి లభ్యత గల చిన్న చెరువుల తో పాటు శాశ్వతంగా నీటి వనరులు ఉండే చెరువులను గుర్తించారు. 9772 మంది సభ్యులకు లాభం చేకూరేలా చేప పిల్లలు పంపిణీ చేయనున్నారు.


జిల్లాలో 1.46 కోట్ల చేప పిల్లల పంపిణీకి ఏర్పాట్లు

జిల్లాలో 2020-21 ఆర్థిక సంవత్సరానికిగాను 1.46 కోట్ల చేప పిల్లలను పంపిణీ చేయనున్నారు.  ఈసారి మూడు రకాల చేప పిల్లలను చెరువుల్లో వేయనున్నారు. బొచ్చె, రోహు, బంగారు తీగ రకాల ను చెరువుల్లో వేసేందుకు ప్రభుత్వం నుంచి అను మతి వచ్చింది. అదనపు కలెక్ట ర్‌ రాజేశం ఆధ్వర్యంలో చేప పిల్లల పంపిణీ కోసం సోమవారం టెండర్‌ ప్రక్రియ కూడా పూర్తి చేశారు. ఆంధ్రా ప్రాంతానికి చెందిన ఇద్దరు, జగిత్యాల జిల్లాకు చెందిన ఒకరు టెండర్‌లో పాల్గొన్నారు. నీటి లభ్యత ఎక్కువగా ఉ న్న చిన్న నీటి వనరుల్లో హెక్టార్‌కు 35 నుంచి 40 మి.మీ. పరిమాణం గల 3 వేల చేప పిల్లలను వే యనున్నారు. అయితే బుధవారం నుంచి చేప పిల్ల ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాల్సి ఉండగా, రాష్ట్ర కేబినెట్‌ సమావేశం ఉన్న దృష్ట్యా రాష్ట్ర సంక్షేమ శా ఖ మంత్రి హాజరయ్యే అవకాశం లేకపోవడంతో కార్యక్రమాన్ని వాయిదా వేశారు. రెండు, మూడు రో జుల్లోనే అధికారికంగా అనుమతి తీసుకుని చేప పిల్లల కార్యక్రమాన్ని చేపట్టనున్నారు.


పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నాం..రాజనర్సయ్య, జిల్లా మత్స్య శాఖ అధికారి, జగిత్యాల

జిల్లాలో 620 చెరువుల్లో 1.46 కోట్ల చేప పిల్లలు పంపిణీ చేయాలని నిర్ణయించాం. టెండర్‌ ప్రక్రియ కూడా పూర్తయింది. అనుమతి కోసం ప్రభుత్వానికి రాశాం. కేబినేట్‌ సమావేశం దృష్ట్యా పంపిణీ కార్యక్రమాన్ని రెండు, మూడు రోజుల్లో ప్రారంభిస్తాం.

Updated Date - 2020-08-05T09:53:08+05:30 IST