Abn logo
Oct 17 2021 @ 22:48PM

ఇంటర్‌ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

సామగ్రిని పరిశీలిస్తున్న డీఐఈవో శ్రీధర్‌ సుమన్‌

ఆసిఫాబాద్‌ రూరల్‌, అక్టోబరు 17: జిల్లాలో ఇంటర్మీడియట్‌ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా మాధ్యమిక విద్యాధికారి డాక్టర్‌ శ్రీధర్‌ సుమన్‌ అన్నారు. ఆదివారం ఆయన మ్లాడుతూ  జిల్లా వ్యాప్తంగా ఉన్న 24 పరీక్షా కేంద్రాలకు ఆను సమాధాన పత్రాలు, ఓఎంఆర్‌ కార్డులు, తదితర సామగ్రి జిల్లా కేంద్రానికి చేరుకుందని అన్నారు. పరీక్షా కేంద్రాలకు 18, 19న పరీక్ష సామగ్రి పంపిణీ చేయనున్నట్లు  ఆయా సామగ్రిని ప్రిన్సిపాళ్లు సోమ, మంగళవారాల్లో తీసుకెళ్లాలని అన్నారు. ఈ నెల 25వ తేదీ నుంచి ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు పరీక్ష నిర్వహించనున్నారని అన్నారు. 4,326 మంది జనరల్‌, 882 మంది ఒకేషనల్‌ మొత్తం 5,208 మంది పరీక్ష రాయనున్నట్లు తెలిపారు. విద్యార్థుల హాల్‌ టికెట్లు, నామినల్‌ రోళ్లు, ఫొటో హాజరు షీట్లు, డీ-పారాలను కళాశాలల లాగిన్ల ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని చెప్పారు. పరీక్షా నిర్వహకులకు ఈ నెల 20న శిక్షణ నిర్వహించనున్నట్లు తెలిపారు.