జాన్‌పహాడ్‌ ఉర్సుకు ముమ్మర ఏర్పాట్లు

ABN , First Publish Date - 2022-01-26T06:40:18+05:30 IST

మండలంలోని జాన్‌పహాడ్‌ దర్గా ఉర్సుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 27, 28, 29 తేదీల్లో ఉర్సు నిర్వహించనున్నారు.

జాన్‌పహాడ్‌ ఉర్సుకు ముమ్మర ఏర్పాట్లు

రేపటి నుంచి ఉత్సవాలు

పాలకవీడు, జనవరి 25: మండలంలోని జాన్‌పహాడ్‌ దర్గా ఉర్సుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 27, 28, 29 తేదీల్లో ఉర్సు నిర్వహించనున్నారు. అయితే ఉర్సుకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా సహించేదిలేదని ఇటీవల నిర్వహించిన సమావేశంలో అధికారులు, కాంట్రాక్టర్లను ఆర్డీవో వెంకారెడ్డి హెచ్చరించారు. దీం తో అధికారులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. కా గా, ఉర్సు నిర్వహణకు వక్ఫ్‌బోర్డు కేవలం రూ.7.5లక్షలు మాత్రమే మంజూరు చేసింది. ఇవి సరిపోవని, కనీసంగా రూ.15లక్షలైనా విడుదల చేయాలని వక్ఫ్‌బోర్డును ఆర్డీవో కోరారు. ఈ మేరకు నిధులు విడుదలకు వక్ఫ్‌బోర్డు అంగీకరించినట్టు తెలిసింది.

ఏర్పాట్లలో నిమగ్నమైన అధికారులు

ఉర్సు నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. శానిటేషన్‌, దర్గాకు రంగులు, విద్యుత్‌ దీపాల అలంకరణ, ఇతరత్రా పనులు చేయిస్తున్నారు. సఫాయిబావి వద్దకు భక్తు లు పుణ్యస్నానాలు ఆచరించేప్పుడు ఎలాంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా బావి చుట్టూ బ్యారీకేడ్లు ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా ఉర్సు నిర్వహిం చే మూడు రోజుల పాటు నిరంతరాయంగా విద్యు త్‌ సరఫరా ఉండేందుకు అదనపు ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో సాంకేతికలోపం ఏర్పడితే వెంటనే మార్చేలా మరికొన్ని ట్రాన్స్‌ఫార్మర్లను, సిబ్బందిని అందుబాటులో ఉంచనున్నారు. దక్కన్‌సిమెంట్‌ యాజమాన్యం సహకారంతో 40తాత్కాలిక మరుగుదొడ్ల పనులు కొనసాగుతున్నాయి.అదేవిధం గా నిరంతరాయంగా తాగునీటిని సరఫరా చేసేందుకు దక్కన్‌సిమెంట్‌ యాజమాన్యం ముం దుకు వచ్చింది. దీంతో ఉర్సు ముందు రోజు నుంచే ప్లాస్టిక్‌ డ్రమ్ముల్లో నీటిని అందుబాటులో ఉంచనున్నారు. అదేవిధంగా దర్గా పరిసరాల్లో పారిశుధ్యంపై అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టారు. ఇప్పటికే బ్లీచింగ్‌ బస్తాలు సిద్ధం చేయగా, దర్గా చుట్టూ, మురుగుకాల్వల్లో బ్లీచింగ్‌ చల్లనున్నా రు. దర్గా పరిసరాలు శుభ్రంగా ఉంచేందుకు వాలంటీర్లను నియమించి రాత్రి పూట సైతం పారిశుధ్య పనులు నిర్వహించనున్నారు. దర్గా వద్ద రెండు చో ట్ల ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి భక్తులకు వైద్యసేవలు అందించనున్నారు. అత్యవసర పరిస్థితుల్లో వినియోగించేందుకు అంబులెన్స్‌ను కూడా సిద్ధం చేస్తున్నారు.

పటిష్ఠ బందోబస్తు

ఉర్సుకు పెద్ద సంఖ్యలో భక్తులు రానుండటంతో పోలీ్‌సశాఖ పటిష్ఠ బందోస్తు ఏర్పాట్లు చేస్తోంది. దర్గా వద్ద బ్యారికేడ్లు ఏర్పాటుచేయడంతోపాటు వా హనాల పార్కింగ్‌నకు అధికారులు స్థలాలను కేటాయించారు. దర్గాకు ఇరువైపులా, దామరచర్ల వైపు, నేరేడుచర్ల వైపు పార్కింగ్‌ స్థలాలు కేటాయించారు.గంధం ఊరేగింపు రోజు ద్విచక్ర వాహనాలను సైతం దర్గా పరిసర ప్రాంతాలకు అనుమతించకుండా చర్యలు తీసుకుంటున్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిత్యం పర్యవేక్షించేలా కంట్రోల్‌ రూంను ఏర్పాటుచేస్తున్నారు.

Updated Date - 2022-01-26T06:40:18+05:30 IST