ఎస్సై ప్రిలిమినరీ పరీక్షకు ఏర్పాట్లు

ABN , First Publish Date - 2022-08-07T05:26:38+05:30 IST

జిల్లాలో ఎస్సై ప్రిలిమినరీ రాత పరీక్షకు ఏర్పాట్లు చేశామని ఎస్పీ రాహుల్‌ హెగ్డే తెలిపారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో నోడల్‌ అధికారి, రీజినల్‌ కో-ఆర్డినేటర్‌, చీఫ్‌ సుపరింటెండెంట్లు, బయోమెట్రిక్‌ అధికారులు, అబ్జర్వర్స్‌, ఇన్విజిలేటర్‌లు, రూట్‌ ఆఫీసర్‌లతో ఎస్పీ సమావేశం నిర్వహించారు.

ఎస్సై ప్రిలిమినరీ పరీక్షకు ఏర్పాట్లు
మాట్లాడుతున్న ఎస్పీ రాహుల్‌ హెగ్డే

- ఎస్పీ రాహుల్‌ హెగ్డే

సిరిసిల్ల క్రైం, ఆగస్టు 6: జిల్లాలో ఎస్సై ప్రిలిమినరీ రాత పరీక్షకు ఏర్పాట్లు చేశామని ఎస్పీ రాహుల్‌ హెగ్డే తెలిపారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో నోడల్‌ అధికారి, రీజినల్‌ కో-ఆర్డినేటర్‌, చీఫ్‌ సుపరింటెండెంట్లు, బయోమెట్రిక్‌ అధికారులు, అబ్జర్వర్స్‌, ఇన్విజిలేటర్‌లు, రూట్‌ ఆఫీసర్‌లతో ఎస్పీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో  పరీక్షా కేంద్రాలు పది ఏర్పాటు చేశామని,   అభ్యర్థులు నిమిషం ఆలస్యంగా వచ్చినా అనుమతించబోమని అన్నారు.  ప్రతీ పరీక్షా కేంద్రం వద్ద ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 వరకు 144 సెక్షన్‌ అమలులో ఉంటుందన్నారు. ఆ ప్రాంతాల్లో జిరాక్స్‌ సెంటర్‌లు, ఇంటర్‌నెట్‌ సెంటర్‌ మూసి వేసేందుకు చర్యలు తీసుకున్నామన్నారు.  జిల్లా వ్యాప్తంగా 2,684 మంది  ఎస్సై ప్రిలిమినరీ రాత పరీక్షకు హాజరవుతున్నట్లు చెప్పారు.  ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష ఉంటుందని, గంట ముందు అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. బ్యాగులు, సెల్‌ఫోన్‌లు, స్మార్ట్‌ వాచ్‌లు, క్యాలిక్యులేటర్‌లు, ఇతర ఎలకా్ట్రనిక్‌ పరికరాలకు అనుమతి లేదన్నారు. బయో మెట్రిక్‌ నేపథ్యంలో అభ్యర్థులు చేతివేళ్లకు మెహందీ, టాటూలు లేకుండా చూసుకోవాలన్నారు. సిరిసిల్లలోని జడ్‌పీహెచ్‌ఎస్‌ బాలికలు, కసుమ రామయ్య బాలుర హైస్కూల్‌,  మహతి, అయ్యప్ప, శ్రీహంసవాహినీ, వికాస్‌ డిగ్రీ కళాశాలలు, అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాల, కృష్ణదేవరాయ, సహస్ర, సాయిశ్రీ జూనియర్‌ కళాశాలలో పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేశామన్నారు. అదనపు ఎస్పీ చంద్రయ్య, రీజినల్‌ కో-ఆర్డినేటర్‌ విజయ్‌కుమార్‌, సీఐలు సర్వర్‌, అనిల్‌కుమార్‌, ఎస్సైలు శ్రీనివాస్‌, కిరణ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-08-07T05:26:38+05:30 IST