ఎన్నికల కౌటింగ్‌కు అధికారుల ఏర్పాట్లు

ABN , First Publish Date - 2021-09-18T07:14:16+05:30 IST

మండల పరిషత్‌ ఎన్నికల కౌంటింగ్‌కు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వటంతో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఎన్నికల కౌటింగ్‌కు అధికారుల ఏర్పాట్లు
దర్శిలో ఏర్పాట్లు పరిశీలిస్తున్న రిటర్నింగ్‌ అధికారి

దర్శి, సెప్టెంబరు 17 : మండల పరిషత్‌ ఎన్నికల కౌంటింగ్‌కు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వటంతో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దర్శి నియోజకవర్గంలోని జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్‌ను మోడల్‌స్కూల్లో ఈ నెల 19న నిర్వహిస్తారు. బ్యాలెట్‌ బాక్సులు కూడా ఇక్కడే భద్రపరచారు. రిటర్నింగ్‌ అధికారి కె. కృష్ణవేణి, మండల ప్రత్యేకాధికారి అర్జున్‌నాయక్‌, ఎంపీడీవో జి.శోభన్‌బాబు, తహసీల్దార్‌ వీడిబీ వరకుమార్‌ తదితరులు కౌంటింగ్‌ ఏర్పాట్లు పరిశీలించారు. నియోజకవర్గంలో మొత్తం 5 జడ్పీటీసీలు, 73 ఎంపీటీసీ స్ధానాలు ఉన్నాయి. అందులో దర్శి జడ్పీటిసీ, 37 ఎంపీటీసీ స్ధానాలు ఏకగ్రీవం అయిన విషయం తెలిసిందే. దర్శి, కురిచేడు, దొనకొండ, తాళ్ళూరు, ముండ్లమూరు మండలాల్లోని 36 ఎంపీటీసీలకు, దొనకొండ, కురిచేడు, తాళ్ళూరు, ముండ్లమూరు జడ్పీటీసీ స్ధానాలకు ఇక్కడ కౌంటింగ్‌ నిర్వహిస్తారు. ఈ నేపధ్యంలో ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియ ప్రశాంతగా నిర్వహించేందుకు అధికారులు పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు.

ముండ్లమూరు, : ఈ నెల 19న ఆదివారం జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు ఓట్ల లెక్కింపు జరుగుతుండగా పోటీ చేసిన అభ్యర్థుల తరుపున ఎన్నికల లెక్కింపు ఏజెంట్ల కోసం సంతకాల కార్యక్రమం శుక్రవారం చేపట్టారు. పోటీ చేసిన అభ్యర్థులు మండల పరిషత్‌ కార్యాలయానికి వచ్చి ఏజెంట్‌ ఫారాలను తీసుకున్నారు. 

తాళ్లూరు : ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులు  కౌటింగ్‌ ఏజంట్లను నియమించుకోవాలని ఎంపీడీవో కేవీ.కోటేశ్వరరావు తెలిపారు. స్థానిక ఎంపీడీవోకార్యాలయంలో శుక్రవారం ఎన్నికల్లో పోటీచేసిన వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థుల, పార్టీనేతలతో సమావేశం జరిగింది. ఎన్నికల కమీషన్‌ ఉత్తర్వుల మేరకు కౌంటింగ్‌ ఏజంట్లను ఎవరిని నియమించాలో వివరించారు. అభ్యర్ధులు ఏజంట్లను నియమించేందుకు ఏజంట్‌ ఫారాలు అందజేశారు. ఎన్నికల కమిషన్‌ నిబందనల మేరకుఅభ్యర్ధులు, ఏజంట్లు తప్పని సరిగా వ్యాక్సిన్‌ వేయించుకున్నట్లు సర్టిఫికేట్లు, పరీక్షలు చేయించుకుని కరోనా నిర్థారణ సర్టిఫికేట్లుతీసుకవెళ్లాలన్నారు. సమావేశంలో వైసీపీ జడ్సీటీసీ, ఎంపీపీ అభ్యర్ధులు మారంవెంకటరెడ్డి, తాటికొండశ్రీనివాసరావు,టీడీపీ జడ్పీటీసీ అభ్యర్ది ఐ.శ్రీనివాసరెడ్డి, ఎంపీటీసీఅభ్యర్ధులుఐ.వెంకటేశ్వరరెడ్డి, పలుగ్రామాల ఎంపీటీసీ అభ్యర్ధులు, ఏజంట్లు పాల్గొన్నారు.

Updated Date - 2021-09-18T07:14:16+05:30 IST