ధాన్యం కొనుగోలుకు పకడ్బంధీ ఏర్పాట్లు చేయాలి

ABN , First Publish Date - 2020-04-05T10:44:06+05:30 IST

జిల్లాలో రైతుల నుంచి వరి ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ కె.శశాంక సంబంధిత

ధాన్యం కొనుగోలుకు పకడ్బంధీ ఏర్పాట్లు చేయాలి

కరీంనగర్‌ టౌన్‌: జిల్లాలో రైతుల నుంచి వరి ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ కె.శశాంక సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన అదనపు కలెక్టర్‌ జీవీ శ్యాంప్రసాద్‌లాల్‌, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్‌తో కలిసి తహసీల్దార్లు, వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తీర్ణ అధికారులు, సొసైటీ సీఈవోలతో ధాన్యం కొనుగోళ్లపై వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించిచారు.


పంటకోతల తేదీలను రైతు వారిగా, గ్రామాల వారిగా తయారు చేసి హార్వెస్టర్లను కోతతేదీల ప్రకారంగా రైతులకు అనుసంధానం చేయాలన్నారు. కొనుగోలు కేంద్రాలవద్ద  మంచినీరు వివిధ సౌకర్యాలు కలిపించాలన్నారు. ధాన్యం కొనుగోళ్లు 30-40 రోజుల వరకు కొనసాగుతాయని రైతులకు కోత, పీపీసీ సెంటర్లకు ధాన్యాన్ని తరలించే తేదీలను రైతులకు ముందుగానే తెలుపాలన్నారు. అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ తాలు గింజలు, ధాన్యం తేమ శాతం ఎఫ్‌ఎక్యూ నిబంధనల ప్రకారం ముందుగానే చూసుకోవాలన్నారు. చెల్లింపులు, తూకంలో కోత లేకుండా రైతు లాభపడే విధంగా చూడాలన్నారు. 

Updated Date - 2020-04-05T10:44:06+05:30 IST