Advertisement
Advertisement
Abn logo
Advertisement

మొక్కల పెంపకానికి ఏర్పాట్లు చేయాలి

- అసిస్టెంట్‌ కలెక్టర్‌ శ్రీహర్ష

- నర్సరీలు, పాఠశాలల తనిఖీ

మల్దకల్‌/ ఇటిక్యాల/ గట్టు/ గద్వాల అర్బన్‌, నవంబరు 30 : నర్సరీల్లో మొక్కల పెంపకానికి ఏర్పాట్లు ప్రారంభించాలని అదనపు కలెక్టర్‌ శ్రీహర్ష సిబ్బందిని ఆదేశించారు. మల్దకల్‌ మండలంలోని పావనంపల్లి, అమరవాయి, మద్దెలబండ గ్రామ పంచాయతీల పరిధిలోని నర్సరీలను మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే జూన్‌ నాటికి అవసరమైన మొక్కల పెంపకానికి కవర్లలో మట్టి నింపే ప్రక్రి యను చేపట్టాలని సూచించారు. అనంతరం బూడిదపాడు గ్రామ ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొద్దిసేపు విద్యార్థులతో ముచ్చటించి విద్యా సామర్థ్యాలను పరిశీలించారు. మధ్యాహ్న భోజనం, మౌలిక వసతులపై ఉపాధ్యా యులతో మాట్లాడారు. ఆయన వెంట ఎంపీడీవో కృష్ణయ్య, ఆయా గ్రామాల కార్యదర్ళులు, ఉపాధి హామీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 


మౌలిక సదుపాయాలు కల్పించాలి

బడిబయటి పిల్లలతో పాటు తల్లితండ్రులు లేని చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన అర్బన్‌ రెసిడెన్షి యల్‌ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పిం చాలని అదనపు కలెక్టర్‌ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. ఇటిక్యాల మండలంలోని ఎర్రవల్లి చౌరస్తా సమీపంలో ఉన్న అర్బన్‌ రెసిడెన్సియల్‌ పాఠశాలను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. విద్యాబోధన, పాఠశాలలో సౌకర్యాలు, విద్యార్థుల యోగక్షేమాలపై ప్రత్యేక అధికారి శేషన్నను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలకు విద్యుత్‌ సౌకర్యం పూర్తి స్థాయిలో లేదని, తాగునీటి ఎద్దడి ఉందని, డ్రైనేజీ, పాఠశాలకు రోడ్డు సక్రమంగా లేదని  శేషన్న తెలిపారు. సంబంధిత అధికారులకు తెలిపి సమస్యలను పరిష్కరిస్తామని అదనపు కలెక్టర్‌ చెప్పారు. కార్యక్రమంలో డీవైఎస్‌వో రమేష్‌, కోఆర్డినేటర్‌ హేమలత, డీసీపీవో నరసింహ, కార్యదర్శి గణేష్‌  తదితరులు పాల్గొన్నారు.


పామాయిల్‌ తోటల పెంపకంపై దృష్టి సారించాలి

పామాయిల్‌ తోటల పెంపకంపై దృష్టి సారించాలని అదనపు కలెక్టర్‌ శ్రీహర్ష సూచించారు. మండలంలోని అరగిద్ద గ్రామంలో నిర్వహించిన అవగాహనా సదస్సులో ఆయన పాల్గొన్నారు. అనం తరం గ్రామ సమీపంలో రైతులు సాగు చేసిన ఆయిల్‌పామ్‌ తోటలను పరిశీలించారు. కార్యక్ర మంలో సర్పంచ్‌ యోగేశ్వరి, పీఎసీఎస్‌ అధ్యక్షుడు వెంకటేష్‌ పాల్గొన్నారు.


రక్తదానం ప్రాణదానంతో సమానం

రక్తదానం ప్రాణదానంతో సమానమని అదనపు కలెక్టర్‌ శ్రీహర్ష అన్నారు. గద్వాల ఆర్టీసీ డిపోలో మంగళవారం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తదానంతో అనారోగ్యం తలెత్తదని, దాతలు అపోహలకు గురికావొద్దని సూచించారు. కార్యక్రమంలో రెడ్‌ క్రాస్‌ సొసైటీ జిల్లా చైర్మన్‌ జి.రమేష్‌, డిపో మేనేజర్‌ రామ్మోహన్‌, అసిస్టెంట్‌ మేనేజర్‌ రవీందర్‌గౌడ్‌, బ్లడ్‌బ్యాంక్‌ అధికారి డాక్టర్‌ క్రాంతికుమార్‌ పాల్గొన్నారు. శిబిరంలో 70 మంది ఉద్యోగులు రక్తదానం చేశారు.

Advertisement
Advertisement