సంఘీభావ దీక్షకు తరలిన శ్రేణులు

ABN , First Publish Date - 2021-10-23T06:39:19+05:30 IST

టీడీపీ కార్యాలయంపై దాడి చేయడం అంటే తెలుగుజాతిపై దాడి చేసినట్టేనని టీడీపీ నగర పంచాయతీ అధ్యక్షులు తమ్మినేని శ్రీనివాసులరెడ్డి అన్నారు.

సంఘీభావ దీక్షకు తరలిన శ్రేణులు
కనిగిరిలో నిరసన తెలుపుతున్న టీడీపీ నాయకులు

కనిగిరి, అక్టోబరు 22: టీడీపీ కార్యాలయంపై దాడి చేయడం అంటే తెలుగుజాతిపై దాడి చేసినట్టేనని టీడీపీ నగర పంచాయతీ అధ్యక్షులు తమ్మినేని శ్రీనివాసులరెడ్డి అన్నారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో శుక్రవారం రెండవ రోజు టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు చేస్తున్న ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరు నిరసన దీక్షకు మద్దతుగా కనిగిరిలో సంఘీభావ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ వైఫల్యాలను, అవినీతి అక్రమాలను ప్రశ్నిస్తే దాడులు చేస్తారా..? అని ప్రశ్నించారు. నిందితులను అరెస్టు చేయాల్సిన పోలీసులు బాధితులపై అక్రమ కేసులు పెడుతున్నారన్నారు.  ఈ దీక్షలో తెలుగు రైతు అధికార ప్రతినిధి రాచమల్ల శ్రీనివాసులరెడ్డి, వీవీఆర్‌ మనోహరరావు, ముస్లీం మైనార్టీ సెల్‌ అధ్యక్షులు షేక్‌ అహ్మద్‌, తమ్మినేని వెంకటరెడ్డి, మాజీ అంజుమన్‌ కమిటీ నాయకులు రోషన్‌ సందాని, గాయం తిరుపతిరెడ్డి, చిన్నరామిరెడ్డి, బ్రహ్మంగౌడ్‌, జిలాని, ఎస్తానీబాష బడేబాయి, చిలకపాటి లక్ష్మయ్య, బ్రహ్మరెడ్డి, నరసింహా తదితరులు పాల్గొన్నారు. 

ఉలవపాడు : టీడీపీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు చేస్తున్న దీక్షకు మద్దతు టీడీపీ కార్యకర్తలు అమరావతికి తరలివెళ్లారు. టీడీపీ నేత ఇంటూరి రాజేష్‌, నెల్లూరు పార్లమెంట్‌ టీడీపీ ఆర్గనైజింగ్‌ కార్యదర్శి అమ్మనబ్రోలు రమేష్‌, మండల టీడీపీ మాజీ అధ్యక్షుడు మక్కే నారాయణ, మండల సీనియర్‌ నాయకుడు ఆవుల నరంసింహరావు, చవడబోయిన హరిబాబు, కందగడ్ల వరుణ్‌, అమ్మనబ్రోలు కిరణ్‌కుమార్‌ తదితరులు ఉన్నారు.

దొనకొండ : వైసీపీ అరాచకాలను నిరసిస్తూ టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో   దీక్ష చేపడుతున్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మద్దతు తెలిపేందుకు మండలం నుండి అధికసంఖ్యలో టిడీపీ నాయకులు తరలివెళ్లారు. టీడీపీ మండల అధ్యక్షుడు నాగులపాటి శివకోటేశ్వరరావు, మాజీ అధ్యక్షుడు మోడి వెంకటేశ్వర్లు, నాయకులు పత్తి వెంకటేశ్వర్లు, కొమ్మతోటి సుబ్బారావు, యరగొర్ల బసవయ్య, వల్లపునేని వెంకటస్వామి, పురుషోత్తం సుత్యానందం, తోటా వెంకటేశ్వర్లు, షేక్‌ తోహిద్‌, మన్నెం గాలెయ్య, విప్పర్ల రమణయ్య ఆలంపల్లి పిచ్చయ్య మరికొందరు ప్రత్యేక వాహనాల్లో  తరలివెళ్లి దీక్ష చేపడుతున్న చంద్రబాబునాయుడుకు సంఘీభావం తెలిపారు. 

దర్శి : టీడీపీ జాతీయ కార్యాలయంపై దాడికి నిరసిస్తూ మాజీ సీఎం చంద్రబాబు చేపట్టిన నిరాహరదీక్షకు మద్దతు తెలిపేందుకు దర్శి నియోజకవర్గ టీడీపీ నాయకులు శుక్రవారం మంగళగిరి తరలివెళ్లారు. నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌ పమిడి రమేష్‌ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు దామా కృష్ణ, గుర్రం బాలకృష్ణ, తదితరులు దీక్ష వద్దకు వెళ్లి చంద్రబాబుకు సంఘీభావం ప్రకటించారు. అంతకముందు జిల్లా టీడీపీ లీగల్‌సెల్‌ అధ్యక్షుడు పరిటాల సురేష్‌, బొట్లా సుబ్బారావు తదితరులు దీక్ష వద్దకు వెళ్లి మద్దతు తెలిపారు.

తాళ్లూరు :  కేంద్ర కార్యాలయంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరు ధర్మాగ్రహదీక్ష కార్యక్రమానికి శుక్రవారం తాళ్లూరు మండల టీడీపీ శ్రేణులు అధిక సంఖ్యలో తరలి వెళ్లారు. చంద్రబాబు దీక్షకు టీడీపీ పార్లమెంట్‌ కార్యనిర్వహక కార్యదర్శులు శాగం కొండారెడ్డి, మానం రమే్‌షబాబు, వల్లభనేని సుబ్బయ్య,  టీడీపీ  మాజీ అధ్యక్షుడు షేక్‌ కాలేషావలి, టీడీపీ నేతలు మన్నేపల్లి సమర, బి.ఓబుల్‌రెడ్డి, మేడగం వెంకటేశ్వరరెడ్డి, పోలంరెడ్డి సూరారెడ్డి, కోటిరెడ్డి, పిన్నిక రమేష్‌బాబు, గురవారెడ్డి, శ్రీనివాసరెడ్డి, అన్వర్‌, నాగార్జునరెడ్డి, జి.వేణుబాబు, రామయ్య, ఆదినారాయణ, తిమోతి, అంజిరెడ్డి తదితరుల ఆద్వర్యంలో అధిక సంఖ్యలో కార్యకర్తలు తరలి వెళ్లారు.

ముండ్లమూరు : టీడీపీ కార్యాలయాలపై దాడులను నిరసిస్తూ, జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన ధర్మాగ్రహ దీక్షకు మండలంలోని టీడీపీ సీనియర్‌ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున పలు వాహనాల్లో శుక్రవారం మంగళగిరిలోని కేంద్ర పార్టీ కార్యాలయంలో చేపట్టిన చంద్రబాబు దీక్షకు మద్దతు పలికారు. దర్శి టీడీపీ ఇన్‌చార్జ్‌ పమిడి రమేష్‌బాబు ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిశారు. తరలివెళ్లిన వారిలో మాజీ ఎంపీపీ మందలపు వెంకటరావు, మాజీ జడ్పీటీసీ వరగాని పౌలు, దర్శి నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షుడు మేదరమెట్ల వెంకటరావు, శంకరాపురం సర్పంచ్‌ కూరపాటి నారాయణ స్వామి, మాజీ సర్పంచ్‌ శ్రీనివాసరావు తదితరులు తరలివెళ్లారు.


Updated Date - 2021-10-23T06:39:19+05:30 IST