ఉద్యోగాల పేరిట మోసం: ఎడప్పాడి మాజీ సహాయకుడి అరెస్టు

ABN , First Publish Date - 2021-11-29T16:48:35+05:30 IST

ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నిరు ద్యోగుల వద్ద లక్షలాది రూపాయలు వసూలు చేసి మోసగించిన మాజీ సీఎం ఎడప్పాడి పళనిస్వామి మాజీ సహాయ కుడు మణిని సేలం జిల్లా క్రైం పోలీ సు లు ఆదివారం ఉదయం అరెస్టు చేశారు. సేలం

ఉద్యోగాల పేరిట మోసం: ఎడప్పాడి మాజీ సహాయకుడి అరెస్టు

చెన్నై: ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నిరు ద్యోగుల వద్ద లక్షలాది రూపాయలు వసూలు చేసి మోసగించిన మాజీ సీఎం ఎడప్పాడి పళనిస్వామి మాజీ సహాయ కుడు మణిని సేలం జిల్లా క్రైం  పోలీ సు లు ఆదివారం ఉదయం అరెస్టు చేశారు. సేలం సమీపం ఓమలూరు నడుపట్టికి చెందిన మణి మాజీ సీఎం ఎడప్పాడి వద్ద సహాయకుడిగా పని చేశారు. మణి తన పలుకుబడితో ప్రభుత్వ ఉద్యోగాలు వేయిస్తానంటూ నిరుద్యోగ యువకుల వద్ద లక్షలాది రూపాయలను వసూలు చేశారు. ఇదే విధంగా కడలూరు జిల్లా నైవేలికి చెందిన తమిళసెల్వన్‌ అనే యువకుడికి రాష్ట్ర రవాణా సంస్థలో అసి స్టెంట్‌ ఇంజనీర్‌గా ఉద్యోగం వేయిస్తానని చెప్పి రూ.17 లక్షలు తీసుకున్నాడు. ఈ వ్యవహారంలో మణికి సెల్వకుమార్‌ అనే బ్రోకర్‌ సాయపడ్డాడు. అయితే మాట ప్రకారం ఉద్యోగం ఇప్పించక పోవడం తో తమిళ్‌సెల్వన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసు కున్న మణి తనను అరెస్టు చేయకుండా సేలం కోర్టు లో, హైకోర్టులో పెటు ్టకున్న ముందస్తు బెయిల్‌ పిటిషన్లు తోసివేతకుగుర య్యాయి. ఆ తర్వాత మణి పరార య్యాడు. సేలం క్రైం విభాగం పోలీసుల మణి ఆచూకీ కోసం గాలించి ఆదివారం ఉదయం అరెస్టు చేశారు.

Updated Date - 2021-11-29T16:48:35+05:30 IST