Abn logo
Mar 9 2021 @ 16:54PM

జింకలను వేటాడిన నిందితుల అరెస్ట్

హైదరాబాద్: జింకలను వేటాడిన కేసులో ఇద్దరు నిందితులను నగర సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌కు చెందిన ఈ ఇద్దరు నిందితులు నిజామాబాద్‌ జిల్లాలో జింకలను వేటాడారు. వారి వద్ద నుంచి ఓ జింకతో పాటు జింక మాంసాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 


నిజామాబాద్‌ జిల్లాలో ఓ జింకలను  వీరు వేటాడి చంపారు. ఈ  జింక మాంసంతో పాటు మరో జింకను రహస్యంగా హైద్రాబాద్‌కు తరలిస్తున్నట్లు విశ్వసనీయమైన సమాచారం పోలీసులకు అందింది. దీంతో పోలీసులు నిఘా పెట్టి వేటగాళ్లను అరెస్ట్ చేశారు. గత సంవత్సరం డిసెంబర్‌లో కూడా జిల్లాలో వన్యప్రాణులను వేటాడిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.