ఎక్కడికక్కడ కాంగ్రెస్‌ నాయకుల అరెస్టు

ABN , First Publish Date - 2020-09-19T05:44:59+05:30 IST

రాష్ట్ర కాంగ్రెస్‌ కిసాన్‌ సెల్‌ పిలుపులో భాగంగా డీసీసీ అధ్యక్షుడు కుంభం శివకుమార్‌ రెడ్డి ఆదేశాల మేరకు ప్రగతి భవన్‌ ముట్టడికి జిల్లా కేంద్రం నుంచి

ఎక్కడికక్కడ కాంగ్రెస్‌ నాయకుల అరెస్టు

నారాయణపేట/ మాగనూర్‌/ మక్తల్‌టౌన్‌/ కోస్గి/ ఊట్కూర్‌/ దామర గిద్ద, సెప్టెంబరు 18 : రాష్ట్ర కాంగ్రెస్‌ కిసాన్‌ సెల్‌ పిలుపులో భాగంగా డీసీసీ అధ్యక్షుడు కుంభం శివకుమార్‌ రెడ్డి ఆదేశాల మేరకు ప్రగతి భవన్‌ ముట్టడికి జిల్లా కేంద్రం నుంచి హైదరాబాద్‌కు శుక్రవారం తరలి వెళ్తున్న కాంగ్రెస్‌ నాయకులను నారాయణపేట పోలీసులు అరెస్టు చేసి పీఎస్‌కు తరలించారు. సమస్యలను పరిష్కరించాలని కోరుతున్న ప్రతిపక్ష పార్టీల నాయకులను పోలీసులచే అరెస్టులు చేయించడం దుర్మార్గపు చర్య అన్నారు. ఎకరాకు రూ.50వేల చొప్పున రైతులకు పంట నష్ట పరిహార మందించాలని డిమాండ్‌ చేశారు. అరెస్టు అయిన వారిలో కాంగ్రెస్‌ నాయకులు శశికాంత్‌, రవీందర్‌రెడ్డి, కౌన్సిలర్‌ ఎండీ సలీం, బోయ రమేష్‌, రమేష్‌ కుమార్‌, హస్నోద్దీన్‌, వెంకట్రాములు, అశోక్‌, రవి ఉన్నారు. మాగనూర్‌ మండలంలో అరెస్టయిన వారిలో కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు అనందర్‌ గౌడ్‌, మాజీ సర్పంచ్‌ ఆనంద్‌గౌడ్‌, ఉజ్జెల్లి కృష్ణ య్య, ఉదయ్‌కుమార్‌ శెట్టి, వార్డు మెంబర్‌ ఆనంద్‌గౌడ్‌ ఉన్నారు.


మక్తల్‌ లో టీపీసీసీ అఽధికార ప్రతినిధి రాజుల ఆశిరెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జి వి. శ్రీహరి, బ్లాక్‌కాంగ్రెస్‌ నాయకులు బి.నర్సిములు, పార్టీ మండల అధ్య క్షుడుగణేష్‌కుమార్‌, పట్టణ అధ్యక్షుడు రవికుమార్‌, నాయకులు రంజిత్‌ కుమార్‌రెడ్డి, గోవర్ధన్‌, ఎన్‌బీ నాయకుడు, గుంతలి రవి, ఉప్పర్‌పల్లి నర్సి ములు, అంజప్ప, ఓబ్లేష్‌లను పోలీసులు అరెస్టు చేశారు. కోస్గిలో ఆ పార్టీ మండల అధ్యక్షుడు వార్ల విజయ్‌కుమార్‌, నాయకులు నాగులపల్లి నరేందర్‌, గోవర్ధన్‌రెడ్డి, ఇద్రీస్‌, నాగులపల్లి నర్సిములు, భానునాయక్‌, వెంకటయ్యలను అరెస్టు చేశారు. ఊట్కూర్‌లో కాంగ్రెస్‌ నాయకులు విజేశ్వర్‌రెడ్డి, జలాల్‌, కోరంశంకర్‌ను అరెస్టు చేశారు. దామరగిద్దలో అరెస్టు చేసిన వారిలో కాంగ్రెస్‌పార్టీ మండలఅధ్యక్షుడు శ్రీనివాస్‌, నాయ కులు శరణ్‌నాయక్‌, బాల్‌రెడ్డి, ఖాజామియా, అంజప్ప,, రఘు, తులసి దాస్‌, బాలు ఉన్నారు. పోలీసులు సొంత పూచీకత్తుపై విడుదల చేశారు.

Updated Date - 2020-09-19T05:44:59+05:30 IST