Abn logo
Sep 11 2021 @ 17:53PM

నకిలీ నోట్ల ముఠా అరెస్ట్

హైదరాబాద్‌: నగరంలో నకిలీ నోట్ల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ నోట్ల చలామణికి యత్నించిన ముఠాను అరెస్ట్ చేశామని సీపీ మహేష్‌ భగవత్‌ తెలిపారు. నిందితులను కీసర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు కరీంనగర్‌కు చెందిన వాసులుగా గుర్తించారు. నిందితుల నుంచి కోటి రూపాయల నకిలీ కరెన్సీ నోట్లును, ఓవాహనం స్వాధీనం చేసుకున్నామని రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ తెలిపారు.