Abn logo
Jul 3 2021 @ 21:37PM

లారీ దొంగల అరెస్ట్

తూర్పు గోదావరి‌: జిల్లాలో చోరీలు చేస్తున్న దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన ప్రకారం నల్లజర్లలో లారీ టైర్ల దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసామన్నారు. వీరి వద్ద నుంచి దాదాపు లక్ష రూపాయల విలువైన టైర్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఒక  ట్రాక్టర్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.