పేకాట స్థావరంపై దాడి
ABN , First Publish Date - 2021-05-11T05:37:44+05:30 IST
మండలంలోని పేరూరు గ్రామ సమీపంలో కోడిపిల్లవాగు వద్ద పేకాట(అందర్బహర్) ఆడుతుండగా దాడి చేసినట్లు ఎస్ఐ రామ్మోహన్రెడ్డి సోమవారం రాత్రి తెలిపారు.
- ఐదుగురి అరెస్టు
- 17 మోటార్ సైకిళ్లు సీజ్
రుద్రవరం, మే 10: మండలంలోని పేరూరు గ్రామ సమీపంలో కోడిపిల్లవాగు వద్ద పేకాట(అందర్బహర్) ఆడుతుండగా దాడి చేసినట్లు ఎస్ఐ రామ్మోహన్రెడ్డి సోమవారం రాత్రి తెలిపారు. ఈ దాడిలో ఐదుగురిని అరెస్టు చేసినట్లు తెలిపారు. వారి వద్ద ఉన్న రూ.6,500 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. 13 మందిని గుర్తించామని, ఇంకా చాలా మంది పారిపోయారని తెలిపారు. 17 మోటార్ సైకిళ్లు సీజ్ చేసినట్లు ఎస్ఐ తెలిపారు.