పేకాట రాయుళ్ల అరెస్ట్

ABN , First Publish Date - 2021-06-08T00:27:39+05:30 IST

జిల్లాలో పేకాట ఆడుతున్న పలువురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. తమకు

పేకాట రాయుళ్ల అరెస్ట్

కామారెడ్డి: జిల్లాలో పేకాట ఆడుతున్న పలువురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. తమకు అందిన విశ్వసనీయ సమాచారంతో బిచ్కుంద మండలంలోని పెద్ద దేవడాలో వ్యవసాయ క్షేత్రంపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో అక్కడ పేకాట ఆడుతున్న  23 మందిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి  రూ. 2,84,500 నగదు, 21 సెల్‌ఫోన్స్, 10 బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

Updated Date - 2021-06-08T00:27:39+05:30 IST