Abn logo
Jun 25 2021 @ 20:59PM

ఇద్దరు చైన్ స్నాచర్ల అరెస్ట్

సైబరాబాద్ : నగరంలోని బాలానగర్, పేట్‌బషీర్‌బాగ్‌లలో ఇద్దరు చైన్ స్నాచర్లను పట్టుకున్నామని సీపీ సజ్జన్నార్ తెలిపారు. వారి వద్ద నుంచి 16.3 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని సీపీ పేర్కొన్నారు. సంతోష్, కరుణాకర్ అనే ఇద్దరు ప్రయివేటు ఉద్యోగాలు చేస్తూ జల్సాలకు అలవాటు పడి చైన్ స్నాచింగ్‌కు పాల్పడ్డారని సీపీ వివరించారు. వారి టూ వీలర్లు వాహనాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. చైన్ స్నాచింగ్  చేసేటపుడు బండి నెంబర్లు కనిపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారన్నారు. చైన్ స్నాచింగ్ చేసిన తర్వాత బట్టలు మార్చుకునేవారని ఆయన పేర్కొన్నారు.

 మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. రద్దీగా ఉండే ప్రాంతాల్లోనే ప్రయాణం చేయాలని, జనసంచారం లేని ప్రాంతాల్లో ప్రయాణం చేయొద్దన్నారు.  ఎవరైనా అడ్రస్ అడుగుతున్నా, ఏదైనా మాట్లాడుతున్నా దూరంగా ఉండాలన్నారు. అటెన్షన్ డైవర్ట్ చేసి చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్నారనిసీపీ సజ్జన్నార్ తెలిపారు.