స్వామి ప్రసాద్ మౌర్యకు అరెస్ట్ వారెంట్

ABN , First Publish Date - 2022-01-12T23:38:52+05:30 IST

ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ మంత్రివర్గం నుంచి రాజీనామా చేసి కొద్ది గంటలు కూడా..

స్వామి ప్రసాద్ మౌర్యకు అరెస్ట్ వారెంట్

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ మంత్రివర్గం నుంచి రాజీనామా చేసి కొద్ది గంటలు కూడా కాకముందే ఎమ్మెల్యే స్వామి ప్రసాద్ మౌర్యకు పాత కేసులో అరెస్టు వారెంట్ జారీ అయింది. 2014లో విద్యేషపూరిత ప్రసంగం చేశారన్న కేసులో ఈనెల 24వ తేదీ లోపు తమ ముందు హాజరు కావాలంటూ సుల్తాన్‌పూర్‌ ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు బుధవారంనాడు ఆదేశాలు జారీ చేసింది. హిందూ దేవుళ్లకు వ్యతిరేకంగా మౌర్య మాట్లాడారంటూ 2014లో కేసు నమోదైంది.


యూపీ మంత్రివర్గానికి స్వామి ప్రసాద్ మౌర్య మంగళవారంనాడు రాజీనామా చేశారు. పడ్రౌనా నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్న మౌర్య.. బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత. యోగి క్యాబినెట్‌లో కార్మిక మంత్రిగా పనిచేశారు. 2017లో యూపీ ఎన్నికలకు ముందు ఆయన బీజేపీలో చేరారు. మౌర్య కుమార్తె సంఘమిత్ర మౌర్య బదౌన్ నియోజకవర్గం బీజేపీ ఎంపీగా ఉన్నారు.

Updated Date - 2022-01-12T23:38:52+05:30 IST