మాకు నిర్బంధాలు...వారికి బందోబస్తా..?

ABN , First Publish Date - 2021-10-22T04:59:52+05:30 IST

శాంతియుతంగా ఆందోళన చేస్తున్న తమను పోలీసులు నిర్బంధించారని, వైసీపీ నాయకులు రహదారిని బంద్‌ చేసి చంద్రబాబు దిష్టిబొమ్మ దహనం చేసినా వారిని అడ్డుకోకుండా బందోబస్తు కల్పించారని కాశీబుగ్గ పోలీసుల తీరుపై టీడీపీ నాయకులు ధ్వజమెత్తారు. గురువారం పలాసలో టీడీపీ నాయకులు వజ్జ బాబూరావు, గాలి కృష్ణారావు, లొడగల కామేశ్వరరావు యాదవ్‌ విలేకరులతో మాట్లాడారు.

మాకు నిర్బంధాలు...వారికి బందోబస్తా..?
పలాసలో మాట్లాడుతున్న టీడీపీ నాయకులు


 పోలీసుల తీరుపై టీడీపీ నాయకుల ధ్వజం

పలాస, అక్టోబరు 21: శాంతియుతంగా ఆందోళన చేస్తున్న తమను పోలీసులు నిర్బంధించారని, వైసీపీ నాయకులు రహదారిని బంద్‌ చేసి చంద్రబాబు దిష్టిబొమ్మ దహనం చేసినా వారిని అడ్డుకోకుండా బందోబస్తు కల్పించారని కాశీబుగ్గ పోలీసుల తీరుపై టీడీపీ నాయకులు ధ్వజమెత్తారు. గురువారం పలాసలో టీడీపీ నాయకులు వజ్జ బాబూరావు, గాలి కృష్ణారావు, లొడగల కామేశ్వరరావు యాదవ్‌ విలేకరులతో మాట్లాడారు. తమ పార్టీ కార్యాలయాలపై దాడులు చేయడంతో ప్రజలకు తెలియజేయాలన్న ఉద్దేశంతో బంద్‌కు పిలుపు నిచ్చినట్లు తెలిపారు. తాము వేకువజామున ఆర్టీసీ కాంప్లె క్స్‌కు చేరి బస్సులను ఆపితే పోలీసులు బలవంతంగా జీపులు ఎక్కించి పోలీస్‌స్టేషన్‌కు తరలించారన్నారు. అయితే అదేరోజు వైసీపీ నాయ కులు ప్రజా జీవ నానికి ఆటంకం కలిగించేలా దారి బంద్‌ చేసి ట్రాఫిక్‌ స్తంభించినా అడ్డుకోవాల్సిన పోలీసులు వారికి సహకరించారని ఆరోపిం చారు. సమా వేశంలో టీడీపీ నాయకులు గురిటి సూర్యనారాయణ, టంకాల రవిశంకర్‌ గుప్తా, బడ్డ నాగరాజు, సప్ప నవీన్‌, శంకర్‌, హరి, గంగారామ్‌ తదితరులు పాల్గొన్నారు.


అరాచక పాలనతో ప్రభుత్వం భయపెట్టలేదు

ఆమదాలవలస: ప్రభుత్వం  అరాచక పాలనతో ప్రజలను భయపెట్ట లేదని టీడీపీ  జిల్లా కార్యాలయ కార్యదర్శి మొదవలస రమేష్‌ తెలిపారు. గురువారం ఆమదాలవలసలో పార్టీ మండలాధ్యక్షుడు నూకరాజుతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ పెద్దలు కొందరు ముఠాలు సృష్టించి గంజాయి, ఇసుక, ఎర్రచందనం దోచుకొని  దౌర్జన్యపాలన కొనసాగిస్తున్నారని ఆరోపించారు. దేవినేని అవినాష్‌ ముఠా పట్టాభి ఇంటిపై దాడిచేసి చిన్నపిల్లలను సైౖతం కొట్టడం హేయమైన చర్యఅని, ప్రజలు ఇటువంటి చర్యలను సమర్ధించరని చెప్పారు. తమ పార్టీ రాష్ట్ర కార్యాలయంపై దాడి సమయంలో డీజీపీ కార్యాలయంలో పనిచేస్తున్న పీఆర్వో అక్కడ ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు.


 దృష్టి మళ్లించేందుకే వైసీపీ నాటకాలు

హరిపురం: వైసీపీ ప్రభుత్వంపై వస్తున్న తీవ్రమైన వ్యతిరేకతను ప్రజల దృష్టిమళ్లించడానికే నాటకాలు అడుతోందని మందస టీడీపీ మండలాధ్యక్షుడు బావన దుర్యోధన తెలిపారు. గురువారం హరిపురంలో  ఆయన విలేకరులతో మాట్లాడుతూ గంజాయి, హెరాయిన్‌కు రాష్ట్రం అడ్డాగా మార డంతో యువతను కాపాడాలని వేడుకున్న టీడీపీ నాయకులు, కార్యా లయా లపై  దాడులు చేస్తున్నారని ఆరోపించారు.  వైసీపీ ప్రభుత్వం పాలన  ఇలా గే కొనసాగితే  భూస్థాపితం కావడం ఖాయమన్నారు. టీడీపీ నాయకులు రట్టి లింగరాజు, లబ్బ రుద్రయ్య, గున్నయ్య  పాల్గొన్నారు. 


వైసీపీ నాయకులపై కేసు నమోదు చేయండి 

వజ్రపుకొత్తూరు: పోలీసులు అధికార పార్టీకి పక్షపాతంగా వ్యవహ రించి టీడీపీ నాయకులు, కార్యాలయాలపై దాడిచేసిన వైసీపీ నాయకులపై కేసులు నమోదు చేయాలని టీడీపీ నాయకులు  డిమాండ్‌ చేశారు. గురువారం పూండిలో మాజీ ఎంపీపీ గొరకల వసంతస్వామి ఇంటివద్ద చంద్ర బాబునాయుడు చేపట్టిన దీక్షకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా టీడీపీ మండలాధ్యక్షుడు సూరాడ మోహనరావు, ప్రధాన కార్యదర్శి కర్ని రమణ, పుచ్చ ఈశ్వరరావు, బి.శశిభూషన్‌, జిల్లా ఉపాధ్యక్షుడు పి.సాంబమూర్తి విలేకరులతో మాట్లాడారు. వైసీపీ ప్రజా వ్యతిరేక పాలనపై ప్రశ్నిస్తుంటే నాయకులపైన, కార్యాలయాలపైన దాడులుచేసి తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని విమర్శించారు. ఇటువంటి దాడులకు టీడీపీ కుటుంబ సభ్యు లు భయపడరని తెలిపారు. బుధవారం టీడీపీ చేపట్టిన ధర్నాను అడ్డుకొని స్టేషన్‌కు తరలించిన పోలీసులు, వైసీపీ నాయకులు చెప్పిన దీక్షకు అడ్డు చెప్పకపోవడాన్ని ఖండించారు. కార్యక్రమంలో డాక్టర్‌ కృష్ణారావు, ఎంపీటీసీ సభ్యుడు సూల చిట్టిబాబు, మరడ దుర్యోధనరెడ్డి, ఆకుల పాపారావు, అప్పాజీ, ఎ.ఉమామహేశ్వరరావు, అప్పారావు పాల్గొన్నారు.


ప్రతిపక్షాలపై పోలీసుల తీరు సరికాదు

పొందూరు: రాష్ట్రంలో పోలీసులు అధికారపార్టీ కార్యకర్తల్లా వ్యవహరి స్తున్నారని టీడీపీ నాయకుడు బలగ శంకరభాస్కర్‌  ఒక ప్రకటనలో విమ ర్శించారు. రాష్ట్రంలో టీడీపీ కార్యాలయాలపై జరిగిన దాడులకు నిరసనగా శాంతియుతంగా బంద్‌ నిర్వహణకు సిద్ధమైన టీడీపీ నాయకులను అర్ధ రాత్రి అరెస్టు చేసి తరలించారని తెలిపారు. వైసీపీ నిర్వహించిన నిరసన లకు మాత్రం సహకరించారని పేర్కొన్నారు. వారి నిరసనల వల్ల గంటల పాటు ట్రాఫిక్‌ నిలిచిపోయినా పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించారని తెలి పారు. పోలీసుల తీరును ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు.

 

Updated Date - 2021-10-22T04:59:52+05:30 IST