Abn logo
Sep 28 2021 @ 00:46AM

2న పవనకల్యాణ్‌ రాక

కొత్తచెరువులో శ్రమదానంతో రోడ్లపై గుంతలు పూడ్చనున్న జనసేన అధినేత

అనంతపురం,సెప్టెంబరు27 (ఆంధ్రజ్యోతి): జనసేన పార్టీ అధినేత పవనకల్యాణ్‌ అక్టోబరు 2వ తేదీన జిల్లాకు రానున్నారు. గాంధీ జ యంతిని పురస్కరించుకొని రోడ్ల దుస్థితిపై ప్రభుత్వ వైఖరిని తప్పుబడుతూ శ్రమదానం తో వాటికి మరమ్మతులు చేయనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ఆ యన తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలోని కాటన బ్యారేజీపై దెబ్బతిన్న రోడ్డుకు మరమ్మతులు చేసే కార్యక్రమాన్ని పూర్తి చేసి ప్రత్యేక విమానంలో  పుట్టపర్తికి చేరుకుంటారు. రోడ్డు మా ర్గాన కొత్తచెరువుకు చేరుకుని ఆ పంచాయతీలోని పుట్టపర్తి-ధర్మవరం రోడ్డుపై ఏర్పడిన గుంతలను శ్రమదానం చేసి పూడ్చనున్నారు. అక్కడే ప్రజలనుద్దేశించి మాట్లాడుతారు. పవనకల్యాణ్‌ ఈ కార్యక్రమాన్ని ఎంచుకోవడానికి ప్రధాన కారణం ఉంది. రాష్ట్రంలో ఛిద్రమైన రహదారుల గురి ంచి జనసేన పార్టీ ఈ నెల 2,3,4 తేదీల్లో సామాజిక మాధ్యమాల వేదికగా ఉద్యమించిన విషయం తెలిసిందే.  దెబ్బతిన్న రోడ్లకు కనీస మరమ్మతులైనా చేయాలని ప్రభుత్వానికి నాలుగు వారాలు గడువు ఇచ్చారు. అయి తే ప్రభుత్వం వాటిని  పట్టించుకోకపోవడంతో గాంధీ జయంతిని పురస్కరించుకొని ప్రతి ని యోజకవర్గంలో ఒక రహదారికి మరమ్మతులు చేసేందుకు శ్రీకా రం చుడతానని జనసేన అధినేత అప్పట్లో ప్రభుత్వానికి స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అం దులో భాగంగానే ప్రభుత్వ అలసత్వం, నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ రహదారుల మరమ్మతులకు ఆ పార్టీ శ్రీకారం చుట్టిన నేపథ్యంలో జిల్లాలోని జనసేన నాయకులు ఆ కార్యక్రమానికి సమాయత్తమయ్యారు.