వచ్చేసింది కియా సొనెట్‌

ABN , First Publish Date - 2020-09-19T05:55:08+05:30 IST

దక్షిణ కొరియా కార్ల తయారీ దిగ్గజం కియా మోటార్స్‌.. కాంపాక్ట్‌ ఎస్‌యూవీ మోడల్‌ సొనెట్‌ను భార త

వచ్చేసింది కియా సొనెట్‌

కారు ప్రారంభ ధర రూ.6.71 లక్షలు..

పెట్రోల్‌, డీజిల్‌ ఇంజిన్‌ ఆప్షన్లలో లభ్యం 


న్యూఢిల్లీ: దక్షిణ కొరియా కార్ల తయారీ దిగ్గజం కియా మోటార్స్‌.. కాంపాక్ట్‌ ఎస్‌యూవీ మోడల్‌ సొనెట్‌ను భార త మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. దీని ప్రారంభ ధర రూ.6.71 లక్షలు. కాగా, గరిష్ఠ రేటు రూ.11.99 లక్షలు. హ్యుండయ్‌ వెన్యూ, మారుతీ సుజుకీ విటారా బ్రెజ్జా, టాటా నెక్సాన్‌, హోండా డబ్ల్యూఆర్‌-వీ, ఫోర్డ్‌ ఎకోస్పోర్ట్‌కు పోటీగా కియా ఈ కారును మన మార్కెట్లోకి విడుదల చేసింది. కియా సొనెట్‌ పెట్రోల్‌తోపాటు డీజిల్‌ ఇంజిన్‌ ఆప్షన్‌లోనూ లభ్యం కానుంది. మొత్తం 17 వేరియంట్లు మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. 


ఇప్పటికే 25,000 బుకింగ్‌లు

ఇప్పటివరకు కియా సొనెట్‌కు 25,000 బుకింగ్‌లు వచ్చినట్లు కంపెనీ వెల్లడించింది. ఆగస్టు 20 నుంచి ముందస్తు బుకింగ్‌ను ప్రారంభించింది. 


ఏపీలోని ప్లాంట్‌లో రెండు షిఫ్ట్‌ల్లో ఉత్పత్తి

భారత్‌లోని కియా మోటార్స్‌ ఏకైక ప్లాంట్‌ ఆంధ్రప్రదేశ్‌లో ఉంది. ఈ ప్లాంట్‌కు ప్రస్తుతం ఎలాంటి సరఫరా ఇబ్బందుల్లేవని, ఇప్పటికే రెండో షిఫ్ట్‌ ఉత్పత్తిని సైతం ప్రారంభించినట్లు కియా మోటార్స్‌ ఇండియా ఎండీ, సీఈఓ కూఖ్యూన్‌ షిమ్‌ వెల్లడించారు. 


ఏడాదిలో లక్ష కార్ల విక్రయ లక్ష్యం

తొలి ఏడాదిలో దేశీయ మార్కెట్లో లక్ష సొనెట్‌ కార్లను  విక్రయించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు కియా మోటార్స్‌ ఇండియా ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌, చీఫ్‌ సేల్స్‌ ఆఫీసర్‌ టే-జిన్‌ పార్క్‌ తెలిపారు. విదేశాలకు మరో 50,000 యూనిట్లు ఎగుమతి చేయాలనుకుంటోంది సంస్థ. 70కి పైగా దేశాలకు కంపెనీ ఈ కారును ఎగుమతి చేయనుంది. 


ప్రపంచ మార్కెట్‌ కోసం భారత్‌లో కంపెనీ తయారు చేస్తోన్న తాజా మోడల్‌ సొనెట్‌. ఇప్పటికే ఈ కారుకు భారత వాహన ప్రియుల నుంచి మంచి స్పందన లభించింది. 

- కియా మోటార్స్‌ ఎండీ, సీఈఓ కూఖ్యూన్‌ షిమ్‌  



ప్రత్యేకతలివే..


నావిగేషన్‌, ట్రాఫిక్‌ ఇన్ఫర్మేషన్‌తో కూడిన 10.25 అంగుళాల హెచ్‌డీ టచ్‌స్ర్కీన్‌ 

వైరస్‌, బ్యాక్టీరియా నుంచి రక్షణ కల్పించే స్మార్ట్‌ ప్యూర్‌ ఎయిర్‌ ఫ్యూరిఫయర్‌ 

బోస్‌ కంపెనీకి చెందిన ప్రీమియం సెవెన్‌ స్పీకర్‌ సౌండ్‌ సిస్టమ్‌ విత్‌ సబ్‌వూఫర్‌ 

ఫ్రంట్‌ వెంటిలేటెడ్‌ డ్రైవర్‌ అండ్‌ ప్యాసింజర్‌ సీట్లు 

రిమోట్‌ ఇంజిన్‌ స్టార్ట్‌ 

ఓవర్‌ ది మ్యాప్‌ (ఓటీఏ) మ్యాప్‌ అప్‌డేట్స్‌ 

వైర్‌లెస్‌ స్మార్ట్‌ఫోన్‌ చార్జర్‌ విత్‌ కూలింగ్‌ ఫంక్షన్‌ 




Updated Date - 2020-09-19T05:55:08+05:30 IST