Abn logo
Sep 22 2021 @ 23:23PM

ఎంపీటీసీలకు ‘కళా’ అభినందన

రాజాం : అభిందిస్తున్న కళా వెంకటరావు

రాజాం : నూత నంగా ఎన్నికైన ఎంపీటీసీ సభ్యుల ను, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్లను టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యులు, ఎచ్చెర్ల నియోజక వర్గ పార్టీ ఇన్‌చార్జి కిమిడి కళావెంకట రావు అభినందించారు. ఈ మేరకు బుధవారం తన క్యాంపు కార్యాలయంలో రణస్థలం ఎంపీటీసీగా ఎన్నికైన పెద్దింటి గౌరి, గులివిందల నర్సిం గరావు, మజ్జి వెంకటరమణ తదితరులను అభినందించారు.  కార్యక్రమంలో మజ్జి రమేష్‌, మహదాసు రమణయ్య, జీవీ రమణ తదితరులు పాల్గొన్నారు. 


- కొత్తూరు : నూతనంగా ఎన్నికైన ఎంపీటీసీ సభ్యులు పాతపట్నం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి కలమట వెంకట రమణను బుధవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారిని అభినందించిన కలమట మాట్లాడుతూ... ప్రాదేశికాల అభివృద్ధితో పార్టీ ఉన్నతికి కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో గురండి,  కొత్తూరు-3, సిరుసు వాడ, మాతల, కడుము ఎంపీటీసీ సభ్యులతోపాటు తెలుగు యువత అధ్యక్షుడు చింతాడ కోటి తదితరులు పాల్గొన్నారు.