వీడియో: టాయిలెట్ పేపర్‌ మీద ఆకట్టుకునే ఆర్ట్

ABN , First Publish Date - 2020-05-26T01:01:48+05:30 IST

చైనాకు చెందిన ఆర్టిస్ట్ ఏంజెలా హుయ్ కరోనా సమయంలో బ్రష్‌కు పదును పెడుతున్నారు.

వీడియో: టాయిలెట్ పేపర్‌ మీద ఆకట్టుకునే ఆర్ట్

బీజింగ్: చైనాకు చెందిన ఆర్టిస్ట్ ఏంజెలా హుయ్ కరోనా సమయంలో బ్రష్‌కు పదును పెడుతున్నారు. కరోనా లాక్‌డౌన్ వేళ జ్ఞాపకం కోసం వెరైటీ ఆర్ట్‌‌లు వేస్తున్నారు. కరోనా బయటపడ్డ మొదట్లో చైనాలో టాయిలెట్ పేపర్ల కోసం ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఏ ఒక్క షాపింగ్ మాల్‌లోనూ టాయిలెట్ పేపర్లు కనిపించలేదు. ఉన్న స్టాక్ మొత్తం ఖాళీ అయిపోయిందంటూ షాపుల యజమానులు చెప్పారు. కొన్ని మాల్స్‌లో అయితే టాయిలెట్ పేపర్ల కోసం మహిళలు కొట్టుకున్నారు. ఈ సంఘటనలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. కరోనా మహమ్మారి కారణంగానే ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యాయని హుయ్ అన్నారు. అటువంటి దృశ్యాలు చూసిన తరువాతే తాను వినూత్నంగా ఆలోచించానని హుయ్ చెబుతున్నారు. ఈ కారణంగానే హుయ్ టాయిలెట్ పేపర్లపై ఆకట్టుకునే బొమ్మలతో ఆర్ట్ వేస్తూ వస్తున్నానన్నారు.

Updated Date - 2020-05-26T01:01:48+05:30 IST