కృత్రిమ బీచ్‌!

ABN , First Publish Date - 2020-11-05T05:30:00+05:30 IST

బీచ్‌ చూడాలంటే సముద్రం చెంతకు వెళ్లాల్సిందే. కానీ పారిస్‌లో ప్రజలకు ఆ అవసరం లేదు. సముద్రం లేకున్నా వాళ్ల చెంతకు బీచ్‌ వచ్చి చేరింది...

కృత్రిమ బీచ్‌!

బీచ్‌ చూడాలంటే సముద్రం చెంతకు వెళ్లాల్సిందే. కానీ పారిస్‌లో ప్రజలకు ఆ అవసరం లేదు. సముద్రం లేకున్నా వాళ్ల చెంతకు బీచ్‌ వచ్చి చేరింది. పారిస్‌ ప్రజల కోసం కృత్రిమ బీచ్‌ను ఏర్పాటు చేశారు. 


  1. ప్రతిఏటా వేసవికాలంలో ప్రజలు సేద తీరడం కోసం ఈ బీచ్‌ను ఏర్పాటు చేశారు. మరి బీచ్‌ అంటే ఆషామాషి కాదు కదా! కొన్ని వేల టన్నుల ఇసుకను అధికారులు తరలించారు. కృత్రిమ బీచ్‌ అనే భావన కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. అక్కడక్కడా బెంచీలు, ఫౌంటెన్స్‌, పిల్లలు ఆడుకోవడానికి కావాల్సిన వస్తువులు ఏర్పాటు చేశారు. 
  2. సీన్‌ నదీ తీరం ఎదురుగా ఈ బీచ్‌ ఉంటుంది. సముద్రం లేకపోయినా నిజమైన బీచ్‌లో ఉన్న భావనే కలుగుతుంది. అందుకే కృత్రిమ బీచ్‌లో సరదాగా గడపడానికి ప్రజలు తరలి వస్తుంటారు.
  3. రాత్రుళ్లు పర్యాటకులతో బీచ్‌ కనువిందు చేస్తుంది. కృత్రిమ బీచ్‌ ఆలోచన సక్సెస్‌ కావడంతో అలాంటి బీచ్‌లు మరిన్ని ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నారట అధికారులు.

Updated Date - 2020-11-05T05:30:00+05:30 IST