సివిల్స్ అభ్యర్థులకు స్ఫూర్తినిస్తున్న ఆర్తికా శుక్లా.. ఆమె ప్రిపరేషన్ ఎలా సాగిందంటే..

ABN , First Publish Date - 2021-12-13T16:14:17+05:30 IST

ఆర్తికా శుక్లా ఉత్తరప్రదేశ్‌లోని వారిణాసి..

సివిల్స్ అభ్యర్థులకు స్ఫూర్తినిస్తున్న ఆర్తికా శుక్లా.. ఆమె ప్రిపరేషన్ ఎలా సాగిందంటే..

ఆర్తికా శుక్లా ఉత్తరప్రదేశ్‌లోని వారిణాసి నివాసి. ఆమె తండ్రి వైద్యుడు. తల్లి గృహిణి. ఆర్తికా శుక్లాకు ఇద్దరు సోదరులు. వారు కూడా యూపీఎస్సీ ఎగ్జామ్ క్లియర్ చేశారు. చదువు విషయానికొస్తే ఆర్తికా శుక్లా తన ప్రాథమిక విద్యను సెయింట్ జాన్ స్కూలులో చదువుకున్నారు. చిన్నప్పటి నుంచి ఆర్తికా చదువు విషయంలో అమితమైన ఆసక్తి చూపేవారు. ఆమె మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. ఆ తరువాత ఆమె పీజీఐఎంఈఆర్ నుంచి ఎండీ కోర్సులో చేరారు. ఇదేసమయంలో సివిల్ సర్వీసెస్‌పై దృష్టి సారించారు. దీంతో ఎండీ కోర్సును మధ్యలోనే వదిలేసి, సివిల్స్‌ పరీక్షకు సిద్ధమయ్యారు. అర్పిత 2014లో యూపీఎస్సీ పరీక్షకు ప్రిపరేషన్ ప్రారంభించారు.


ఆమె ప్రిలిమ్స్, మెయిన్స్‌కు ఏకకాలంలో ప్రిపేర్ అయ్యారు. ఇందుకోసం ఆమె ఏ కోచింగ్ సెంటర్‌లోనూ చేరలేదు. అయితే ఆమెకు సివిల్స్ కోచింగ్‌లో ఆమె అన్నయ్య ఎంతో సహకారం అందించారు. ప్రణాళికా బద్ధంగా చదివితే ఈ ఎగ్జామ్‌కు ఏడాది సరిపోతుందని ఆర్తికా శుక్లా తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆమె 2015లో తొలిసారిగా సివిల్స్ పరీక్షకు హాజరయ్యారు. తొలి ప్రయత్నంలోనే ఆల్ ఇండియా ఫోర్త్ ర్యాంక్ సాధించి, టాపర్స్ జాబితాలో స్థానం సంపాదించి, సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఉదాహరణగా నిలిచారు. తగిన ప్రణాళికతో ప్రిలిమ్స్‌కు హాజరైతే సులభంగా క్లియర్ చేయవచ్చని, అయితే మెయిన్స్‌కు మరింత కృషి చేయాలన్నారు. దీనితో పాటు కరంట్ అఫైర్స్ కోసం న్యూస్ పేపరు చదువుతుండాలని ఆమె సూచించారు.

Updated Date - 2021-12-13T16:14:17+05:30 IST