ప్రభుత్వ ఆర్ట్స్‌ కళాశాలకు నాలుగు ఐఎస్‌వో సర్టిఫికెట్లు

ABN , First Publish Date - 2021-04-17T06:30:20+05:30 IST

రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆర్ట్స్‌ కళాశాలకు ప్రతి ష్టాత్మక హెచ్‌వైఎం ఇంటర్నేషనల్‌ ఐఎస్‌వో సంస్థనుంచి నాలుగు ఐఎస్‌వో సర్టిఫికెట్లు లభించా యి. కళాశాల సెమినార్‌ హాలులో జరిగిన ఓ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌ డేవిడ్‌కుమార్‌, సిబ్బంది ఈ సర్టిఫికెట్లు అందుకున్నారు.

ప్రభుత్వ ఆర్ట్స్‌ కళాశాలకు నాలుగు ఐఎస్‌వో సర్టిఫికెట్లు
ఐఎస్‌వో సంస్థ ప్రతినిధి నుంచి సర్టిఫికెట్లు అందుకుంటున్న ప్రిన్సిపాల్‌ డేవిడ్‌కుమార్‌

రాజమహేంద్రవరం అర్బన్‌, ఏప్రిల్‌ 16: రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆర్ట్స్‌ కళాశాలకు ప్రతి ష్టాత్మక హెచ్‌వైఎం ఇంటర్నేషనల్‌ ఐఎస్‌వో సంస్థనుంచి నాలుగు ఐఎస్‌వో సర్టిఫికెట్లు లభించా యి. కళాశాల సెమినార్‌ హాలులో జరిగిన ఓ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌ డేవిడ్‌కుమార్‌, సిబ్బంది ఈ సర్టిఫికెట్లు అందుకున్నారు. హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న హెచ్‌వైఎం ఇంట ర్నేషనల్‌ ఐఎస్‌వో సర్టిఫికేషన్‌ ప్రైవేట్‌ లిమిడెట్‌ సంస్థ గతేడాది కళాశాలను సందర్శించి ఆడిట్‌ నిర్వహించిందని డేవిడ్‌కుమార్‌ తెలిపారు. ఈ మేరకు సంస్థ ప్రకటించిన వివరాల ప్రకారం.. 9001, 14001, 27001, 50001 ఐఎస్‌వో సర్టిఫికెట్లు సాధించడానికి అన్ని అర్హతలు ఉ న్నందున వీటిని ప్రకటించినట్టు సంస్థ అధికార ప్రతినిధి ఆలపాటి శివయ్య తెలియజేశారన్నారు. కళాశాల లో ఉత్తమ పరిశోధనా సామర్థ్యం, పర్యావరణ-పరిశోధన, డేటాసెక్యూరిటీ, ఉత్తమ ఎనర్జీమేనేజ్‌ మెంట్‌ విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిందని తెలిపారన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నాలుగు ఐఎస్‌వో సర్టిఫికెట్లు సాధించిన ఏకైక కళాశాలగా రాజమహేంద్రవరం ఆర్ట్స్‌ కళాశాల ఆవిర్భవించిందన్నారు. జిల్లాలోని 8 డిగ్రీ కళాశాలలు ఈ ఐఎస్‌వో సర్టిఫికెట్లు అందుకున్నాయి.

Updated Date - 2021-04-17T06:30:20+05:30 IST