Abn logo
Sep 16 2020 @ 17:15PM

అరుణాచల్ ప్రదేశ్ సీఎం కరోనా

ఇటానగర్: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ రోజురోజుకూ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రికి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చినట్లు వైద్య అధికారులు వెల్లడించారు. ఢిల్లీలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసిన ఒక రోజు తర్వాత సీఎం పెమా ఖండుకు కరోనా పరీక్షలు చేయడంతో కోవిడ్-19 పాజిటివ్ వచ్చింది. వైద్యుల సలహా మేరకు తాను సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నట్లు సీఎం పెమా ఖండు ట్వీట్ చేశారు.

Advertisement
Advertisement
Advertisement