హుస్సేన్‌ సాగర్‌ తీరాన ‘లేక్‌ వ్యూ డెక్‌’

ABN , First Publish Date - 2022-01-22T15:46:36+05:30 IST

హుస్సేన్‌సాగర్‌ తీరాన జలవిహార్‌ సమీపంలో నిర్మిస్తున్న థీమ్‌పార్క్‌లో త్వరలో లేక్‌వ్యూ డెక్‌లు రానున్నాయి. హైదరాబాద్‌ నగరానికి తెలంగాణ జిల్లాలు, ఆంధ్రప్రదేశ్‌తోపాటు

హుస్సేన్‌ సాగర్‌ తీరాన ‘లేక్‌ వ్యూ డెక్‌’

ఇలాంటి కనువిందైన వంతెన.. మన చెంతనా..! 

ఇది రష్యా రాజధాని మాస్కోలోని ప్రఖ్యాత పర్యాటక స్థలం ఫ్లోటింగ్‌ బ్రిడ్జి. మన హైదరాబాద్‌లోని పీవీఎన్‌ఆర్‌ మార్గ్‌లో (నెక్లెస్‌ రోడ్డు) హుస్సేన్‌ సాగర్‌ మీద ఈ ఏడాది చివరికల్లా ఇలాంటి పర్యాటక అద్భుతమే ఆవిష్కృతం కానుందంటూ పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద కుమార్‌ ట్వీట్‌ చేశారు.


హైదరాబాద్‌ సిటీ: హుస్సేన్‌సాగర్‌ తీరాన  జలవిహార్‌ సమీపంలో నిర్మిస్తున్న థీమ్‌పార్క్‌లో త్వరలో లేక్‌వ్యూ డెక్‌లు రానున్నాయి. హైదరాబాద్‌ నగరానికి తెలంగాణ జిల్లాలు, ఆంధ్రప్రదేశ్‌తోపాటు పొరుగు రాష్ర్టాలు, విదేశాల నుంచి నిత్యం వేలాది మంది సందర్శకులు వస్తుంటారు. ఈ క్రమంలో విదేశాల్లో ఉండేలా సాగర తీరంలో వేర్వేరుగా రెండు లేక్‌ వ్యూ డెక్‌లను ఏర్పాటు చేసే పనులను కొంతకాలం క్రితం ప్రారంభించారు. ప్రస్తుతం నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. నెక్లెస్‌ రోడ్డు (పీవీఎన్‌ఆర్‌ మార్గ్‌)లో వచ్చే ఈ లేక్‌వ్యూ డెక్‌ ఆధారంగా సందర్శకులు హుస్సేన్‌సాగర్‌ నీటిపై గల బ్రిడ్జిపై నడుస్తూ ఆహ్లాదకరంగా గడిపేలా రూపొందిస్తున్న పనులు వేగవంతమయ్యాయి. ఇందులో రష్యాలో నిర్మించిన ‘లేక్‌ వ్యూ డెక్‌’ ఫొటోను జతపరిచిన అర్వింద్‌కుమార్‌ ఈ ఏడాది చివరికి ఇది అందుబాటులోకి రానుందని ఆయన ట్విటర్‌లో పేర్కొన్నారు. 

Updated Date - 2022-01-22T15:46:36+05:30 IST