Abn logo
Dec 4 2020 @ 11:22AM

బాక్సర్‌గా ఆర్య

హీరో ఆర్య బాక్సర్‌గా తమిళ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆర్యా గతేడాది నటించిన ‘మహాముని’, ‘కాప్పాన్‌’ చిత్రాలు విజయవంతమయ్యాయి. ఈ నేపథ్యం లో ‘అట్టకత్తి’, ‘మద్రాస్‌’, ‘కబాలి’, ‘కాలా’ చిత్రాలకు దర్శకత్వం వహించిన పా. రంజిత్‌ నటుడు ఆర్యాతో కొత్త చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఆ చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరిగింది. కాగా ఆ చిత్రానికి ‘సర్పట్టా పరంబరై’ అనే టైటిల్‌ను ఖరారు చేసి  ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆ పోస్టర్‌లో నటుడు ఆర్య కండలు తిరిగిన దేహంతో బాక్సర్‌గా ఉన్నఫొటో ను చూసి ఆయన అభిమానులు ఆశ్చర్యపోయారు. నార్త్‌ చెన్నైకి చెందిన బాక్సర్లకు సంబంధించిన కథతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో బాక్సర్‌ పాత్రలో నటించేందుకు ఆర్య తీవ్రంగా కసరత్తు చేసి సిక్స్‌ప్యాక్‌కు మారారు. కే9 స్టూడియోస్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఆర్యతోపాటు కళైఅరసన్‌, పసుపతి, భగవతి, సంతోష్‌, జాన్‌ విజయ్‌, సంజనా నటరాజన్‌, తుషార తదితరులు నటిస్తున్నారు.

Advertisement
Advertisement
Advertisement